అతి వేగమే అనర్ధాలకు మూలం:ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్

Spread the love

గద్వాల:-నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అతి వేగమే ప్రధాన కారణమని గద్వాల పట్టణ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు కారణాలపై సీఐ కార్యాలయ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించి,ట్రాఫిక్ నియమాలపై అవహహన కలిపించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ…ప్రతి గంటకు జిల్లాలో ఎక్కడో ఒక్క చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని,అతి వేగం, నిర్లక్ష్యం, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి దుర్లక్షణాలను వదిలివేయాలని సూచించారు.

వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. వెళ్లే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం కొన్ని సందర్భాలలో యువత మైనర్లు వాహనాలకు సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్నారు.యువత బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తాం.మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు జరిమానా విధిస్తున్నాం అని అన్నారు.

మనసు ఆందోళనతో ఉన్నప్పుడు వాహనం నడపరాదని, అది ప్రమాదాలకు దారితీయవచ్చన్నారు.వాహన యజమాని తప్పనిసరిగా వాహనానికి భీమా చేయించాలని, డబ్బులు మిగులుతాయని భావించి భీమాను నిర్లక్ష్యం చేయవద్దన్నారు.వహనాలు నడిపే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి ప్రమాదాల నుంచి భారీ పడకుండా జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ సిబంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page