షాపూర్ నగర్ హమాలి సంఘం కార్మికులు షాపూర్ నగర్ అడ్డ వద్ద ఏర్పాటు చేసిన చేసిన చలివేంద్రాన్ని నేడు ఏఐటీయూసీ,సీఐటీయూ నాయకులతో కలిసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్మికులే కలిసి ఎండాకాలంలో ప్రజల దాహార్తి తీర్చడానికి స్వచ్చందంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చెయ్యడం మంచి పనని ఇలాగే అందరు కలిసి మెలిసి ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల మంచి వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, సీపీఎం కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ హమాలి కార్మికులు ఒక కుటుంబంగా జీవిస్తూ,తమ సంపాదనలో చేతనైనంత సహాయం ఇతరులకు చెయ్యడం ఒక గొప్ప విషయం అని ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేసి ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి, సీఐటీయూ నాయకులు దేవదానం,ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, డీ వై ఎఫ్ ఐ నాయకులు అంజయ్య, ఏఐటీయూసీ,సీఐటీయూ నాయకులు నర్సింహారెడ్డి, మహేందర్, శ్రీనివాస్, జార్జ్,చంద్రమౌళి,మహేందర్, గురప్ప, యాగంటి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.* :
*చలివేంద్రాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…