నేడు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా

Spread the love

నేడు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా

ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వర్తింపు

18,883 జంటలకు రూ.141.60 కోట్ల సాయం

నేడు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్‌

అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

పేద తల్లిదండ్రులు పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే సామాజిక బాధ్యతకు అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ‘వైఎస్సార్‌ కళ్యాణమస్తు’ ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు ‘వైఎస్సార్‌ షాదీ తోఫా’ ద్వారా ఆర్థిక సాయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page