గడప గడపకి మన ప్రభుత్వం కార్యమానికి నేటితో 100 రోజులు

Spread the love
Today is 100 days of our government's work

వినుకొండ నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యమానికి నేటితో 100 రోజులు


మహనీయుని పాద స్పర్శతో పులకరించిన పుడమి


సాక్షిత : గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం 100వ రోజులో భాగంగా ఈ రోజు బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామంలో గడప-గడపకి మన ప్రభుత్వం అంటూ మండల స్థాయి, సచివాలయం స్థాయి ఉద్యోగులను వెంటపెట్టుకొని ప్రతీ గడపని సందర్శిస్తున్న సందర్భంగా ప్రతీ కుటుంబ సభ్యుడు జగన్నన ప్రభుత్వంలో, మీ ఆధ్వర్యంలో మాకు అర్హత ఉన్నంత వరకు అన్ని సంక్షేమ పధకాలు అందుతున్నాయని,

మా పేద కుటుంబాలకి ఈ ఆర్ధిక సహాయం ఎంతో మేలు చేస్తుందని కరోనా వంటి కష్టం కాలంలో ఈ విధమైన ఆర్ధిక సహాయం కనుక మాకు లేకపోతే మా జీవనాన్ని కొనసాగించడానికి అనేక అప్పులు చేయవలసి వచ్చేదని, మళ్ళీ ఆ అప్పులు తీర్చలేక అనేక ఇబ్బందులు పడేవాళ్ళమని, కానీ మన జగన్ మోహన్ రెడ్డి గ ప్రభుత్వం లో మేము ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్నామని అన్నారు.

అదేవిధంగా గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న సమయం లో వర్షం రావడం చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా వర్షం లేక చిన్న సన్నకారు రైతులమైన మేము అనేక ఇబ్బందులు పడ్డామని, కానీ మీ పాద స్పర్శతో వర్షం పడిందని ఈ సమయంలో ఈ వర్షం వలన మా ప్రాంత రైతులకి అనేక ఉపయోగo జరుగుతుందని అన్నారు.

గతoలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయంలో సకాలంలో వర్షాలు పడి, పాడి-పంటలతో సుఖంగా ఉన్నామని, అదేవిదంగా మళ్ళీ 10 సంవత్సరాల తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సమయంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయని, ఎంతో కొంత వర్షాలు పడుతూ సుఖ సంతోషాలతో ఉన్నామని, కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వర్షాలు లేక తీవ్రమైన కరువు వలన మా బ్రతుకులు చితికి పోయాయాని 10 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడిప్పుడే మా బతుకులు మారుతున్నాయని మేము ఉన్నన్ని రోజులు మా బ్రతుకులు మార్చిన జగనన్నకి, మన వినుకొండని అన్ని విధాలా అభివృద్ది పరచడానికి నిరంతరం శ్రమిస్తున్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కి మా జీవితం ఉన్నన్ని రోజులు అండగా ఉంటామని అన్నారు.

గ్రామ ప్రజల ఆదరణ చూసి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనను అన్ని విధాలా ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటానని, నేను అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిత్యం వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని నా ప్రాణం ఉన్నన్నినాళ్ళు నా వినుకొండ ప్రజలకోసమే పని చేస్తానని అన్నారు.

అదేవిధంగా గడప-గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మొదలు పెట్టిన నాటి నుండి ఇప్పటివరకు 100 రోజులు ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా 44 గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో ప్రతి గడపకు వెళ్ళి వారికీ మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల వల్లన వారు పొందిన లబ్దిని శ్వేత పత్ర రూపంలో వారికీ అందించి,

వారికీ, ఆ గ్రామానికి ఇంకా ఏమేనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకొని, వారికి ఉన్న సమస్యల పరిష్కారాని అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా అధికారులని ఆదేశించి గ్రామంలో అవసరమున్న చోట సిమెంట్ రోడ్, సైడ్ కాలువలు నిర్మించేందుకు వీలుగా ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని, అదేవిధంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిస్కారించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Related Posts

You cannot copy content of this page