తిరుపతి యువ హీరోను ఆదరిద్దాం పోస్టర్ ఆవిష్కరణలో ఆర్.పీ.ఎస్ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి

Spread the love

తిరుపతి యువ హీరోను ఆదరిద్దాం పోస్టర్ ఆవిష్కరణలో ఆర్.పీ.ఎస్ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి – సాక్షిత, తిరుపతి బ్యూరో: ఎలాంటి సినీ సిఫార్సులు లేకుండా, స్వయం కృషి పై ఆధారపడి నటనలో ప్రతిభ కనబరిచిన తిరుపతి యువ హీరో ఉదయగిరి శ్రీహరిని అందరూ ఆదరిద్దాం అని రాయలసీమ పోరాట సమితి(ఆర్.పీ.ఎస్) కన్వీనర్ పీ.నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు హీరోగా శ్రీహరి నటించిన “మాటరాని మౌనమిది” మూవీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం తిరుపతి లో జరిగింది. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆత్మీయ మిత్రులు ఉదయగిరి భాస్కర్ కుమారుడు అయిన శ్రీహరి వెండితెరపై మొదటిసారి నటించి 19న(రేపు) విడుదల వుతున్న “మాటరాని మౌనమిది” చిత్రం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నట్లు తెలిపారు. శ్రీహరి నటుడిగా బుల్లితెరకు సుపరిచితులని, అనేక సీరియల్స్ లో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందాడని పేర్కొన్నారు. వారసత్వ విధానాలకు భిన్నంగా స్వయంకృషి తో ఎదిగి వెండితెరపై ప్రేక్షకుల మనస్సు లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలని కోరారు. నేటి రాజకీయాలలో, సినీ పరిశ్రమలో వారసత్వ సాంప్రదాయానికి భిన్నంగా కేవలం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్వయంకృషితో “మాటరాని మౌనమిది” హీరోగా పరిచయం అవుతున్న మన తిరుపతి యువకున్ని నిండు మనస్సుతో తెలుగు ప్రేక్షకులంతా దీవించాలని సూచించారు. ఆ చిత్రం విజయవంతం అవ్వాలని శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని మనస్పూర్తిగా కోరుకుంటూ హీరో శ్రీహరికి, యూనిట్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.

Related Posts

You cannot copy content of this page