SAKSHITHA NEWS

Tirupati, Nimma Research Center completes 50 years

సాక్షిత తిరుపతి జిల్లా:
డా౹౹YSR ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని తిరుపతి, నిమ్మ పరిశోధన కేంద్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా కాకాణి గోవర్ధన్ రెడ్డి .

ఇన్ఫర్మేషన్ సెంటర్ ను ప్రారంభించి, స్క్రీన్ హౌస్ ను సందర్శించి, నర్సరీ మొక్కల పెంపకాన్ని పరిశీలించి, ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ప్రారంభించి, పలు సంచికలు విడుదల చేసి, ఆదర్శ రైతులను సన్మానించిన అనంతరం శాస్త్రవేత్తలు, రైతులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి కాకాణి.

శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పలు కైంకర్యాలకు వినియోగించే పూలను ఉపయోగించి, డా౹౹ YSR ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహిళల చేత వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తయారుచేసి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే “పుష్ప ప్రసాదం” చిత్రపటాల తయారీని తిలకించి, తయారు చేసే మహిళలను అభినందించిన మంత్రి కాకాణి.

కార్యక్రమంలో పాల్గొన్న డా౹౹YSR ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా౹౹ జానకిరామ్ , ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, ఉద్యానవన శాఖ అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు.


SAKSHITHA NEWS