*సాక్షిత : రేణిగుంట సిఆర్ఎస్ సమీపంలోని కేంద్రియ విద్యాలయంను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు ముఖ్యంగా పర్మినెంట్ అధ్యాపకుల లేమి వలన వారు పడుతున్న ఇబ్బందుల గూర్చి ఆలాగే వాష్ రూమ్స్ అపరిశుభ్రంగా ఉంటున్నాయని విద్యార్థులు ఎంపీ గురుమూర్తికి ఏకరువు పెట్టారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొన్నారు. సమస్యలన్నీ కేంద్రియ విద్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకొంటామని విద్యార్థులకి చెప్పారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని వారిని ఉత్తేజ పరిచారు.
కేంద్రియ విద్యాలయం – 2 ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
Related Posts
ఏ పీ లో ఫ్రీ బస్సు పథకం 2000 బస్సులు 11,500 మంది సిబ్బంది అవసరం
SAKSHITHA NEWS ఏ పీ లో ఫ్రీ బస్సు పథకం 2000 బస్సులు 11,500 మంది సిబ్బంది అవసరం * ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుతూ వస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత…
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు…