SAKSHITHA NEWS

Tirupati MP Gurumurthy participated in the Tirupati Jagananna sports celebrations

తిరుపతి జగనన్న క్రీడా సంబరాలలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి


సాక్షిత : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక, యువజన శాఖ నిర్వహణలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న క్రీడా సంబరాలు పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తున్న విషయం అందరికీ విదితమే. అందులో భాగంగా నేడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహించిన ఈ సంబరాలలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు.

గూడూరు నియోజకవర్గం కోట పట్టణంలో అసంపూర్తిగా ఉన్న స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయాలనీ మంత్రి రోజా దృష్టికి తీసుకెళ్ళి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు మన దినచర్యలో క్రీడలు భాగం కావాలని ఆయన అన్నారు. ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలువ వచ్చు అనే ఆత్మవిశ్వాసతో ముందుకు వెళ్లాలని ఆలాగే ఇంత పెద్ద ఎత్తున జగనన్న క్రీడా ఉత్సవాలు నిర్వహించడం హర్షనీయమన్నారు.

అనంతరం తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక కళలను వెలికితీయడంలో మంత్రి రోజా తనదైన శైలిలో కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు.

చివరగా మంత్రి రోజా మాట్లాడుతూ హిందువులు సంక్రాంతి, ముస్లింలు రంజాన్, క్రిస్టియన్స్ క్రిస్టమస్ జరుపుకొంటారు కాని అందరూ కలిసి చేసుకొనే పండగ మన ముఖ్యమంత్రి జగనన్న పుట్టినరోజు అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి నగర మేయర్ శిరీషా కలిసి వాలీబాల్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.


SAKSHITHA NEWS