SAKSHITHA NEWS

This academic year with own funds for studies

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ కి చెందిన సుజాత కుమార్తె తరుణి అనే పేద విద్యార్థికి ఎంబీబీఎస్ ఉన్నత చదువులకోసం స్వంత డబ్బులతో ఈ విద్యా సంవత్సరంకు గాను కాలేజీ ఫీజు 25,000 /- రూపాయలను చెక్కు రూపేణా చెల్లించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నా స్వంత డబ్బులతో చదివిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి జీవితాలలో వెలుగులు నింపడానికి నా వంతు సహాయ సహకారాలను అందిస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు

. వైద్య విద్యానభ్యసించడానికి గాను   కాలేజీ ఫీజు ల నిమ్మితం ఈ విద్య సంవత్సరంకు గాను 25,000/- రూపాయలను చెక్కు రూపేణా ఇవ్వడం జరిగినది అని, వారి ఆర్థిక స్థోమత లేక పేదవారు కావడం వలన కాలేజీ ఫీజు కట్టుకోలేని స్థోమత లేకపోవడం  చదువలకు ఆటంకం కల్గకుండా ,విద్యార్థి భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని 25,000/- రూపాయలను చెక్కు రూపేణా  కట్టడం జరిగినది అని,

,వారి ఆర్థిక పరిస్థితికి చలించి ప్రభుత్వ విప్ గాంధీ ముందు కు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మంచి భవిష్యత్తు ను ఏర్పరచుకొని ఉన్నత లో స్థిరపడలని ప్రభుత్వ విప్ గాంధీ విద్యార్థి తరుణి ను ఆశీర్వదించడం జరిగినది .ఎప్పుడు ఏ సహాయం కావల్సిన తన వంతు కృషి  చేస్తానని విద్యార్థికి చెప్పడం జరిగినది .

దీనికి విద్యార్థి మరియు కుటుంబ సభ్యులు స్పందిస్తూ  కాలేజీ ఫీజు కొరకు  ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రభుత్వ విప్ గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెల్పడం జరిగినది ,మంచిగా చదువుకొని ,పది మందికి ఉపయోగపడేలా ఉంటానని ,నా పై చదువులకు ఆర్ధిక సహాయాన్ని అందించిన ప్రభుత్వ విప్ గాంధీ ని జీవితం లో ఎప్పటికి మర్చిపోలేనని విద్యార్థి చెప్పడం జరిగినది .

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS