వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్‌లు వారివారి విధానాల్లో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారు.
ఆ ముగ్గురి నుంచి పాఠాలు నేర్చుకుని.. ఆ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పారు.
కొత్తగా రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నామని వెల్లడించారు.
ఫార్మా సిటీలు రద్దు చేస్తున్నట్లు తమ ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఫార్మాసిటీలను జనావాసాల మధ్య కడితే.. గాలి, నీరు, భూమి కలుషితమవుతాయని చెప్పారు.
అలాకాకుండా సిటీకి దూరంగా ఫార్మా విలేజ్‌లు నిర్మిస్తామని.. సకల సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.
చైనాలోని బీజింగ్‌కు వెళ్తే అన్నిరకాల వస్తువులు లభిస్తాయని..
అలానే హైదరాబాద్‌ను డెవలప్‌మెంట్ చేయాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.