There is no dearth of funds for the development of Kutbullapur constituency
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత లేదు…
ప్రతీ బస్తీ, కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం…
జగద్గిరిగుట్టలో రూ.6.08 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో రూ.6.08 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవాలు మరియు శంఖుస్థాపనలు చేశారు. మొదటగా బీరప్ప నగర్ లో రూ.92 లక్షలతో నూతనంగా చేపడుతున్న స్లాబ్ కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు.
దేవమ్మ బస్తీలో రూ.94 లక్షలతో నూతనంగా చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు, రూ.39.30 లక్షలతో చేపడుతున్న స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సంజయ్ పూరి కాలనీలో రూ.75.30 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
జగత్గిరినగర్ లో రూ.32 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంజయ్య నగర్ లో రూ.49.40 లక్షలతో నూతనంగా నిర్మించిన స్లాబ్ కల్వర్టును ప్రారంభించారు. శివ నగర్ లో రూ.28.40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాజీవ్ గృహకల్పలో రూ.49.90 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
రింగుబస్తీలో రూ.55 లక్షలతో నూతనంగా చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీసల బస్తీలో రూ.29.60 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మక్దుమ్ నగర్ లో రూ.64 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన వీడిసిసి రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జగద్గిరిగుట్ట అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కొత్తగా వెలసిన బస్తీలు, కాలనీల్లో ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎన్ని నిధులకైనా వెనకడుగు వేయకుండా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత లేదన్నారు. రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఈఈ రూపాదేవి, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణా గౌడ్, మారయ్య, వేణు యాదవ్, హజ్రత్ అలీ, బాబు గౌడ్, ఇందిరా గౌడ్, పాపుల్ గౌడ్, బండ మహేందర్, శశిధర్, పాపిరెడ్డి, తెరాల శ్రీనివాస్ గుప్త, వీరాచారి, ఆంజనేయులు,
మల్లేష్ గౌడ్, హనుమంత్, ప్రవీణ్ గుప్త, రాజు, వర లక్ష్మీ, సురేందర్, మురళి, వెంకట్ రెడ్డి, శంకర్ గుప్త, యాట వరలక్ష్మి, జయశ్రీ, బాలలక్ష్మీ, నాగరాజు, రత్నేశ్వర్ రావు, వెంకటేశ్వర్ రెడ్డి, సరస్వతి, ప్రభాకర్, సంతోష్, అంజి, ధర్మెందర్, కృష్ణ, మహమూద్, సాజిద్, లక్ష్మణ్, సువర్ణ, మనోజ్ మరియు బస్తీల సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.