SAKSHITHA NEWS

ఏ క్యాన్సర్ అయినా ఉపశమనం పొందవచ్చు
— క్యాన్సర్ స్పెషలిస్ట్, బ్లడ్ డిజార్డర్స్ స్పెషలిస్టు డాక్టర్ హరిష్ కంచర్ల

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

బోన్ క్యాన్సర్‌ కు చికిత్స ఉందని, తొలిదశలో నిర్ధారణ చేస్తే క్యాన్సర్లు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్ రేట్లు 90శాతం మించి ఉంటాయని క్యాన్సర్ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ వైద్యులు డాక్టర్ హరిష్ కంచర్ల అన్నారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. బోన్ క్యాన్సర్‌పై విజయం సాధించిన విజేతలతో క్యాన్సర్ సర్వైవర్స్ సమ్మిట్ నిర్వహించారు. “క్యాన్సర్‌ల గురించి అవగాహన కల్పించడానికి, ‘క్యాన్సర్‌లు పూర్తిగా నయం కావడమే కాకుండా, విజయవంతం అయిన తర్వాత రోగులు సాధారణ జీవితం కొనసాగించవచ్చు అనే వాస్తవాన్ని నొక్కిచెప్పడానికి క్యాన్సర్ సర్వైవర్స్ మీట్‌ను ఖమ్మంలో నిర్వహించడం జరిగిందన్నారు. చికిత్స తర్వాత మనలాగే పూర్తిగా సాధారణ జీవితాన్ని గడపవచ్చు అన్నారు. పేషెంట్ సర్వైవర్స్ మీట్ క్యాన్సర్ బారిన పడినవారు ముందుకు రావడానికి, వారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీనియర్ క్యాన్సర్ స్పెషలిస్ట్, హెమటాలజిస్ట్ డాక్టర్ హరీష్ అన్నారు.

బోన్ క్యాన్సర్ అనేది టీనేజ్ పిల్లలో ఎక్కువగా వస్తుందని, ఎముక మజ్జ, కార్టెక్స్ భాగాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్ అని, ఇందులో ఆస్టియోసర్కోమా, ఎవింగ్స్ సర్కోమా, ఖాండ్రో సర్కోమా అనే రకాలు ఉంటాయన్నారు.

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం వల్ల పూర్తిగా నయం అయ్యే అవకాశాలు గణనీయంగా ఉన్నాయన్నారు. క్యాన్సర్ పరిశోధన చికిత్సలో తాజా పురోగతిని డాక్టర్ హరీష్ వివరించారు. ప్రస్తుత తరుణంలో 2024లో వచ్చే క్యాన్సర్‌లు ఆధునిక కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో, ట్రాన్స్‌ప్లాంట్ వంటి అత్యంత అధునాతన చికిత్సలతో నయం చేయవచ్చన్నారు. వాస్తవానికి టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యునోథెరపీల ద్వారా ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయకుండా క్యాన్సర్ కణాలను ఎంపికచేసి చంపుతాయని, తద్వారా కొన్ని రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా మరింత విజయం సాధించడంతో పాటు సైడ్ ఎఫెఫ్ట్స్ తగ్గుతాయన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఎవింగ్స్ సర్వోమాకి ట్రీట్మెంట్ చేయించుకున్న ఖమ్మం నగరానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి ఆరోగ్యంగా ఉందన్నారు. పాప విషయంలో ముందుగా చెమొథెరపీ ఇచ్చి సైజ్ తగ్గిన తర్వాత క్యాన్సర్ స్టార్ట్ అయినా బోన్ పార్ట్ కి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాలుగా రెగ్యులర్ చెక్ అప్ చేసుకుంటూ ఆరోగ్యంగా వుందని పాప తండ్రి నరసింహరావు పేర్కొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఏ క్యాన్సర్ నుండి అయినా ఉపశమనం పొందవచ్చని డాక్టర్ హరీష్ స్పష్టం చేశారు.

క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి ప్రజలలో అవగాహన తెప్పించడానికి మీడియా ద్వారానే సాధ్యం అవుతుందని తమవంతు కృషి చేస్తున్నామని, క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలని అప్రమత్తం చేయాలని కోరుకుంటున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఖమ్మం యశోద ఆసుపత్రి మేనేజర్ శ్రీనాథ్ పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 21 at 4.56.07 PM

SAKSHITHA NEWS