అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని దించేసేందుకు మహిళా లోకం కదిలిరావాలి

Spread the love

ప్రజల సొత్తును దోచేస్తున్న నాయకులను బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది

జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి

సోమిరెడ్ది నాయకత్వంలో కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను తిరిగి సాధించుకుందాం

ప్రతి కుటుంబానికి మత్స్యకారేతర ప్యాకేజీలో మిగిలిన రూ.18500 అందించే బాధ్యత మాది

అల్లుళ్లకు దోచిపెట్టేందుకు ఇప్పటికే కొండలు, గుట్టలు, తిప్పలు, చెరువులు లేపేసిన కాకాణి గోవర్దన్ రెడ్డికి పొరపాటున మరో అవకాశం ఇస్తే ప్రజల ఆస్తులను కూడా మిగలనీయడు..జాగ్రత్త

ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతిరెడ్డి

సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి పనులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగాయి

బ్రహ్మదేవం ప్రాంతంలో వేల ఎకరాలు ముంపునకు గురికాకుండా కాపాడుతున్న బుడ్డి డ్రైన్ నిర్మాణం సోమిరెడ్డి హయాంలో జరిగిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది

ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులు సోమిరెడ్డి చేస్తే, కాకాణి మాత్రం ప్రైవేటు టోలుగేటు తెరిచి అక్రమ వసూళ్లకు తెరలేపి కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ ను తమిళనాడుకు తరిమేశాడు

కంటైనర్ టెర్మినల్ మూసివేసిన కారణంగా 10 వేల మందికి పైగా యువత ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు

కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రజల కష్టాలను పట్టించుకోవడం మానేసి అక్రమంగా దోచిన సొత్తుతో అల్లుళ్లకు ఇంపోర్టెడ్ కార్లు, కరోనా ప్యాలెస్ లు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు.

దేవుడి కొండగా భావించే ప్రభగిరిపట్నం కొండలను కూడా మాయం చేసిన అనకొండ కాకాణి

పొరపాటున మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే ప్రజల ఆస్తులను కూడా వదిలిపెట్టరు. ఇప్పటికే పేదల ఇళ్ల పట్టాలను వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

మత్స్యకారేతర ప్యాకేజీగా ప్రతి ఇంటికి రూ.43,500 సోమిరెడ్డి మంజూరు చేయించి పంపిణీ కూడా చేపట్టారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి 2019లో పంపిణీని అడ్డుకున్నారు

వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు ప్యాకేజీ అందకుండా కుట్ర చేశారు. మిగిలిన వారికి కూడా రూ.43,500 ఇవ్వకుండా కోత పెట్టి రూ.25 వేలకే పరిమితం చేశారు

టీడీపీ సానుభూతి పరుల కుటుంబాలకు మత్స్యకారేతర ప్యాకేజీ అందించడంతో పాటు ఇప్పటికే రూ.25 వేలు పొందిన వారికి మిగిలిన రూ.18500 ఇప్పించే బాధ్యత మాది

వైసీపీ పాలనలో ఒక చేత్తో రూ.10 ఇచ్చి, మరో చేత్తో రూ.100 లాగేసుకుంటున్నారు

ఐదేళ్లలో కరెంట్ చార్జీలను 9 సార్లు పెంచి పేద ప్రజలపై మోయలేని భారం మోపారు

దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచారు

నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచి పేదల జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చారు

చెత్తపైనా పన్ను వేసిన చెత్త ప్రభుత్వమిది.

Related Posts

You cannot copy content of this page