బీసీ, మైనారిటీల సంక్షేమే మా ప్రభుత్వ లక్ష్యం

Spread the love

బీసీ, మైనారిటీల సంక్షేమే మా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
నెమలికల్లులో బీసీ, ముస్లిం కమ్యూనిటీ హాళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే నంబూరు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. అమరావతి మండలం నెమలికల్లు గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన ముస్లిం కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్ ను ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. నెమలికల్లులో తాను ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేశానన్నారు. గ్రామంలో సిమెంట్ రోడ్లు, సచివాలయంతో పాటు రెండు కమ్యూనిటీ హాళ్లు కూడా నిర్మించామన్నారు.

ఇంత చిన్న గ్రామానికి సుమారు రూ.3.40 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసిన తనకు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. దాంతో పాటు సీఎం జగన్ గారు పంపించిన నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ కి కూడా అండగా నిలిచి.. భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని కోరారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధికి తపించారన్నారు. అందుకే నెమలికల్లు గ్రామం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. నెమలికల్లులో ఇంకా ఏవైనా పెండింగ్ ఉంటే మరోసారి తమ ప్రభుత్వం రాగానే తాను కూడా అభివృద్ధిలో పాలు పంచుకుంటానన్నారు. మన అందరి లక్ష్యం జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమేనన్నారు. అందుకు ఎమ్మెల్యేగా శంకరరావు ని, ఎంపీగా తనను కుటుంబసభ్యుల్లా భావించి గెలిపించాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page