SAKSHITHA NEWS

The unemployed should be given unemployment benefits immediately

నిరుద్యోగులకి వెంటనే నిరుద్యోగ భృతిని ఇవ్వాలి…కూరపాటి శ్రీనివాస్ ఖమ్మం జిల్లా డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నూతనంగా నిర్మించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్య పాలనాధికారి విపి గౌతమ్ ని మిగతా ఉన్నతాధికారాలను కలిసి నిరుద్యోగులు కి నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని. యువజన రంగా సమస్యలు కూడా పరిష్కార మార్గాలు చూపాలని. డివైఎఫ్ఐ ఖమ్మం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ వన్ టౌన్ కార్యదర్శి, జిల్లా సహాయ కార్యదర్శి కూరపాటి శ్రీను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు అవుతుంది.అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక సందర్భాల్లో ఎన్నో పబ్లిక్ మీటింగ్లలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాటిచ్చారు.

కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. 23, 24 సంవత్సరకాలం చివరి బడ్జెట్లో కూడా నిరుద్యోగులు యువజన రంగా సమస్యలకు నిరాశపరిచింది. రాష్ట్రంలో నిరుద్యోగం ఉపాధి అవకాశాల్లో మిగతా రాష్ట్రాల వారిగా మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా రాష్ట్రంలో నిరుద్యోగంలో నానాటికి పెరుగుతుంది.

త్వరగా నిరుద్యోగన సమస్యలను ఆదుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వంపై ఉన్నది. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే గనుక రానున్న రోజుల్లో నిరుద్యోగులతో పోరుకు సిద్ధమే కదులుతామని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు, తెలంగాణ నిరుద్యోగులు అందరు కూడా కదలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టౌన్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు రావులపాటి నాగరాజు, ఎలగందుల అనిల్ కుమార్, వెంకటరమణ, నరేష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS