ఏజెన్సీ గిరిజనేతరులకు ఒక్క డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయని ప్రభుత్వం
గిరిజనేతరులకు గృహలక్ష్మి దరఖాస్తులుకు అవకాశం ఇవ్వాలని కోరిన మాజీ జడ్పిటిసి పాలవంచ దుర్గ
గిరిజనేతర రైతులు పహానిలు లేక పంట రుణాలు తీసుకోలేక అవస్థలు
ఏజెన్సీలో గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా అవకాశం కల్పించాలని కోరిన పాల్వంచ దుర్గ
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు అన్నదమ్ముల లెక్క ఎన్నో సంవత్సరాల నుండి జీవిస్తున్నారని వారిని తెలంగాణ ప్రభుత్వం పథకాల పేరుతో విడదీస్తుందని మణుగూరు మాజీ జెడ్పిటిసి పాల్వంచదుర్గ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం 2014 సంవత్సరం నుండి ఇప్పటివరకు గిరిజనేతరులకు ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆమె కలెక్టర్ కు విన్నవించారు.
నియోజకవర్గంలో గోదావరి పరివాహక ప్రాంతాలైన పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి ప్రాంతాల ప్రజలు వరదల వలన వారి ఇల్లు నీటి మునకతో ఇబ్బందులు పడ్డారని, చాలావరకు ఇల్లులు కూలిపోయాయని ఆమె తెలిపారు. వారికి ఇంటి స్థలాలను కూడా కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని కలెక్టర్ కు విన్నవించారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు భూములకు మాన్యువల్ పహానిలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు పహానిలు లేక రైతులు రుణాలు తీసుకోలేక అవస్థలు పడుతున్నారని మణుగూరు మాజీ జెడ్పిటిసి పాలవంచ దుర్గ తెలిపారు.