SAKSHITHA NEWS

ప్రిన్సిపాల్ ను కాల్చి చంపిన విద్యార్థి

హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమ య్య జిల్లా రాయచోటిలో ఉపాధ్యాయుడిని విద్యా ర్థులు కొట్టి చంపిన ఘటన ను మరువక ముందే ఈరోజు మధ్యప్రదేశ్ లో మరో ఘటన చోటుచేసు కుంది. ఓ స్కూలు ప్రిన్సిపల్ ను ఓ విద్యార్థి మాటువేసి తుపాకితో కాల్చి చంపాడు.

క్రమశిక్షణతో విద్యాబు ద్ధులు నేర్చుకోవాలని విద్యార్థులకు చెప్పడమే ఇందుకు కారణంగా పోలీసులు అనుమానిస్తు న్నారు. చత్తూర్ పూర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

55 ఏళ్ల సురేంద్ర కుమార్ సక్సేనా, ఐదేళ్లుగా దమోరా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు ఈరోజు ఉదయం పాఠశా లకు వచ్చిన ప్రిన్సిపాల్ మధ్యాహ్న సమయంలో బాత్రూమ్‌కు వెళ్లారు.

అక్కడే కాపు కాసిన 12వ తరగతి విద్యార్థి ఆయన బయటకు రాగానే ఒక్క సారిగా కాల్పులకు పాల్పడ్డాడు. తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో సురేంద్ర కుమార్ సక్సేనా, అక్కడికక్కడే మృతి చెందాడు..

అనంతరం మరో విద్యార్థితో కలిసి బైకుపై అతడు అక్కడి నుంచి పరారైనట్లు తోటి విద్యార్థులు పేర్కొ న్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి ఈ ఘటనపై మాట్లాడుతూ.. సక్సేనా ఐదేళ్లుగా ఈ పాఠశాలలో మంచి ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఆయన వారిని మందలించి నందుకే ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దారుణానికి పాల్పడిన విద్యార్థులకు కఠిన శిక్ష విధించాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు.


SAKSHITHA NEWS