
కోడి పందేలు, జూదం ఆడితే చట్టపర్యమైన చర్యలు తప్పవు: సీఐ భీమా నాయక్
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని స్థానిక సీఐ కార్యాలయంలో శనివారం సీఐ ఎం భీమా నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ టి కిషోర్ బాబుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ భీమా నాయక్ మాట్లాడుతూ పామూరు సర్కిల్ పరిధిలో ఎవరైనా సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తే, జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, క్రికెట్ నిర్వహించుకోవాలని , సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సీఐ భీమా నాయక్ కోరారు.
