పేదలను కార్మికులను గాలికొదిలేసిన రాష్ట్ర బడ్జెట్
సిఐటియు కుత్బుల్లాపూర్ కీలుకాని లక్ష్మణ్
రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగాలకు నిధుల కోతకు నిరసనగా షాపూర్ నగర్ లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ఈ కార్యక్రమంలో పాల్గొన్నా కీలుకాని లక్ష్మణ్ మాట్లాడుతూ
రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగాలకు ప్రభుత్వం కోత పెట్టింది. ప్రభుత్వం ప్రతిపాదిత బడ్జెట్‌ను సవరించి ఆయా తరగతులకు న్యాయం చేయాలని.రూ.3, 24,233 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారని 2025-26లో బడ్జెట్‌లో రూ.3,04,000 కోట్లకు పైగా ప్రతిపాదన పెట్టి దాదాపు రూ.26వేల కోట్లు ఖర్చు పెట్టలేదని
ఈ బడ్జెట్. కూడా అదే విధంగా ఉందని ఆరు గ్యారెంటీల అమలుకు ఎలాంటి నిర్దిష్టమైన ప్రతిపాదనలు లేవని పేర్కొన్నారు.రైతు భరోసా కు రూ. 25 వేల కోట్లు అవసరముంటే,రూ.18 వేల కోట్లు మాత్రమే ప్రతిపాదించారని మహాలక్ష్మి పథకానికి మహిళలకు రూ.2,500 ఊసే లేదని తెలిపారు.
రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకుపైగా ఇండ్లు లేనివారుంటే,ఈ బడ్జెట్‌లో కేవలం రూ.5,500 కోట్లు మాత్రమే ప్రతిపాదన చేశారని తెలిపారు.గృహ నిర్మాణానికి గతం కంటే కూడా ప్రస్తుత బడ్జెట్‌లో 1,344 కోట్లు కోత పెట్టారూ.విద్యుత్ రంగానికి రూ.326 కోట్లు తగ్గించారనీ, మైనారిటీల,వెనుకబడిన తరగతుల, గిరిజనుల సంక్షేమానికి కేటాయింపులు లేవని
ఎస్సీ,ఎస్టీలకు గత ప్రభుత్వం దళిత బంధు కింద రూ.10లక్షల చొప్పున ఇస్తామనగా,కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12 లక్షలు ఇస్తామని చెప్పిందనికానీ..బడ్జెట్‌లో కనీసం ఆ ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి.నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదనీ.విద్యా.వైద్యం ప్రయివేటీకరణను అరికట్టాలంటే నిధులు కేటాయింపులు చేసి ప్రభుత్వ రంగంలో దీన్ని బలపరచాలని కానీ నిధులు నామ మాత్రంగా పెంచినట్టుగా చూయించారూ వాస్తవానికి విద్యా,వైద్యాన్ని ప్రయివేటీకరణ నుంచి అరికట్టడానికి అవి ఏమాత్రం సరిపోవని, నిధులు పెంచాలని అన్నారు
విద్యా,వైద్యం,ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి,దళిత,గిరిజన, బలహీన వర్గాల,మైనారిటీల సంక్షేమానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పసుల అంజయ్య శ్రీశైలం స్వాతి యాదవ రెడ్డి కనకయ్య తదితరులు పాల్గొన్నారు
ఇట్లు
కీలుకానీ లక్ష్మణ్

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
