సీఎం సహాయనిధి పేదలకు గొప్ప వరం – కొలన్ హన్మంత్ రెడ్డి*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, 128 డివిజన్ చింతల్ పరిధికి చెందిన చంద్రనగర్ వాసులు పి. నాగేష్, బి. అశోక్ గౌడ్, అలాగే మల్లంపేట్‌కు చెందిన శ్రీమతి సి. అంజు అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని సంప్రదించారు.
వారి విజ్ఞప్తికి వెంటనే స్పందించిన హన్మంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో సీఎం సహాయనిధి 𝗹𝗢𝗖 ద్వారా సి. అంజు కి రూ. 2,75,000, 𝗖𝗠𝗥𝗙 ద్వారా పి. నాగేష్‌కు రూ. 60,000, బి. అశోక్ గౌడ్‌కు రూ. 22,500 ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.
ఈ మంజూరు పత్రాలను ఈ రోజు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాధితులకు అందజేశారు.
.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డా. అవిజే జేమ్స్, బండి శ్యామ్ గౌడ్, సిద్దనోల సంజీవ రెడ్డి, పండరి రావు, మైసిగారి శ్రీనివాస్, కప్ప సుబ్బా రెడ్డి, గణేష్, కొలన్ జీవన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బల్ రెడ్డి, అక్కినబోయిన సాధు యాదవ్, భాస్కర్ రెడ్డి, అదిరెడ్డి, శ్రీనివాస్ ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
