రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి: డీఆర్డీఓ పీడీ
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పిడి సన్యాసయ్య ఆదేశించారు. చివ్వెంల మండలం ఐలపురం, తర్మీయా తండ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రాల్లో నిర్వహిస్తున్న తూకాలు, రిజిస్టర్లు, తేమ శాతాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.
ప్రస్తుతం అకాల వర్షాల ముప్పు ఉన్నందున, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా లారీల రవాణాను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద తార్పాలిన్లు, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని, రైతులకు తాగునీరు, నీడ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. కాటా అయిన వెంటనే ఆన్లైన్లో ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేసి, రైతులకు సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమం లో అడిషనల్ పి.డి. సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
