కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమాగం…

Sakshitha news

కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమాగం…

వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి….

— కోరుకంటి చందర్…

సాక్షిత పెద్దపల్లి//జిల్లాప్రతినిధి: రామగుండం,
కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం రాజుల్లా బతికారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు ఆగమాగం అవుతున్నాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు.
శనివారం టిటిఎస్ అంతర్గాం, పెద్దంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరిగిన జాప్యం రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, సకాలంలో ఎరువులు, రైతుబంధు అందించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా నిల్వ ఉండటంతో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని అన్నారు.

ధాన్యం బస్తాల తూకాల్లో కోతలు విధించడం వల్ల రైతులకు ఆర్థిక నష్టం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపు అయులయ్య యాదవ్, పెద్దంపేట సర్పంచ్ ఆముల శ్రీనివాస్, ఉప సర్పంచ్ కరివేద స్రవంతి శ్రీనివాస్ రెడ్డి, మండల ఇన్‌చార్జ్ కోలా సంతోష్, మాజీ ప్రజాప్రతినిధులు కొలిపక శరణ్య మధుకర్ రెడ్డి, బండారి ప్రవీణ్, ధరణి రాజేష్, తుంగపిండి సతీష్, బండి మహేష్ గౌడ్, రామగుండం పట్టణ ఇన్‌చార్జ్ బోడ్డుపల్లి శ్రీనివాస్, నాయకులు ఎలుక కొమురయ్య, కాంపల్లి సంతోష్, విష్ణు, సుబ్రహ్మణ్యం, కాంపల్లి రాజేష్, అవునూరి ప్రశాంత్, గోర్క సంతోష్, దొమ్మేటి వాసు, ఈదునూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top