భవిష్యత్తును ఆలోచించే కూటమి ప్రభుత్వం

Sakshitha news

భవిష్యత్తును ఆలోచించే కూటమి ప్రభుత్వం

సాక్షిత : ఎలక్ట్రిక్ స్కూటీ నడుపుతా ఇంధనం పొదుపుపై అవగాహన

మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట:కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి నెల మూడవ శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సంకల్పించామని శాసనసభ్యులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ‘ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే మంచి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కూడా శ్రీకాకుళం జిల్లాలో పాల్గొంటున్నారని తెలిపారు.
ప్లాస్టిక్ నిషేధం – ప్రజారోగ్య పరిరక్షణ
ఈ మూడవ శనివారం యొక్క ప్రత్యేకత “ప్లాస్టిక్ నిషేధం” అని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని, ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా బట్ట మరియు జూట్ జనపనారతో చేసిన బ్యాగులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. వ్యాపారస్తులు కూడా ఈ మార్పును స్వీకరించి, కాటన్ మరియు జూట్ బ్యాగులను అందుబాటులో ఉంచితే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, దీనిపై ప్రజల్లో మరియు వ్యాపారులలో విస్తృత అవగాహన తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.


ఇంధన పొదుపుపై అవగాహన
పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు తానే స్వయంగా ఇవాళ ఇంటి నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ పై వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ స్కూటర్ పై తిరుగుతామని కాదు కానీ, ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి, అనవసరమైన ప్రయాణాలను తగ్గించుకుని అవసరమైన మేరకే ఇంధనాన్ని ఖర్చు చేయాలనే సందేశాన్ని ఇవ్వడానికే ఈ ప్రయత్నం చేశానని చెప్పారు.
రాయలసీమ అభివృద్ధి – పరిశ్రమల వెల్లువ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉన్నాయని కొనియాడారు. నిన్ననే రాయలసీమలో ఫ్లైట్స్ విమానాలు మరియు యుద్ధ విమానాలను తయారు చేసే పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు. గతంలో రాయలసీమ అంటే ఒకలా ఉండేదని, కానీ ఇప్పుడు చంద్రబాబు పిలుపుతో అది “రాయల్ సీమ” గా మారుతోందని, ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యరూపం దాల్చేలా చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గొప్పతనమేనని, చంద్రబాబు మరియు లోకేష్ ల కష్టమే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఉన్న తరుణంలో కూడా, మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు రాబోయే పెట్టుబడుల ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే నమ్మకాన్ని, భరోసాని ఈ ప్రభుత్వం కల్పిస్తోందని విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్పష్టం చేశారు.


వర్చువల్ విధానంలో ‘మహానాడు’
ప్రధానమంత్రి పిలుపు మేరకు ఇంధనాన్ని మరియు ఖర్చులను పొదుపు చేయాలనే ఉద్దేశ్యంతో, ఈసారి ‘మహానాడు’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హైబ్రిడ్ మోడల్ ద్వారా ముఖ్యమంత్రి సందేశాన్ని, రాష్ట్ర పార్టీ ఆలోచనలను అందరికీ చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఇది నిరంతరం పనిచేసే ప్రభుత్వ గొప్పతనానికి నిదర్శనమని ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు.

Scroll to Top