“అరైవ్ అలైవ్ ఫేజ్-03”లో భాగంగా ఉచిత కంటి పరీక్ష శిబిరం…
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం…
…..
సాక్షిత పెద్దపల్లి : “అరైవ్ అలైవ్ ఫేజ్-03” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలంలోని రాంపల్లి గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు గ్రామానికి వచ్చి పరీక్షలు నిర్వహించారు.ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 20 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించగా,5 మందిని కేటరాక్ట్ శస్త్రచికిత్స కోసం రిఫర్ చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మల్లేష్ మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని,సీట్ బెల్ట్, హెల్మెట్ వినియోగం ద్వారా ప్రాణాపాయాలను నివారించవచ్చని సూచించారు.
అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదని హెచ్చరించారు.రోడ్డు భద్రతపై,ట్రాఫిక్ నియమాల పాటింపు గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సురక్షిత ప్రయాణంపై సూచనలు చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY