కమిషనరేట్ పరిధి జాతీయ మెగా లోక్ అదాలత్లో పరిష్కరించబడ్డ మొత్తం 8,120 కేసులు…
….
సాక్షిత పెద్దపల్లి//రామగుండం: జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న (కాంపౌండబుల్) ఇండియన్ పీనల్ కోడ్ కేసులు 674,ఎస్ ఎల్ ఎల్ కేసులు 17 పరిష్కరించబడ్డాయి.
ఇ-పెట్టి కేసులు 2,537 పరిష్కరించబడ్డాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 4,892 పరిష్కరించబడ్డాయి.
మొత్తం 8,120 కేసులు పరిష్కరించబడ్డాయి సైబర్ నేరాలకు సంబంధించి రామగుండం కమిషనరేట్ పరిధిలో 75 కేసుల్లో బాధితులకు తిరిగి రిఫండ్ అయిన మొత్తం రూ.33,10,325/-
సి సి పి ఎస్ పోలీస్ స్టేషన్, రామగుండంలో నమోదైన 9 కేసుల్లో బాధితులకు తిరిగి రిఫండ్ అయిన మొత్తం రూ.27,90,301/-మొత్తం 84 సైబర్ నేరాలకు సంబంధించి బాధితులకు తిరిగి రిఫండ్ అయిన మొత్తం రూ.61,00,626/- అందజేయబడిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… లోక్ అదాలత్ ద్వారా పెట్టి కేసులు, ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర స్వల్ప చట్టపరమైన కేసులు వేగంగా పరిష్కరించబడగా, పెండింగ్ కేసుల పరిష్కారంతో ప్రజలకు సమయం మరియు ఖర్చు ఆదా అయిందన్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసుల పరిష్కారానికి సహకరించినట్లు తెలిపారు.పోలీస్ స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఈ విజయవంతమైన ఫలితాలు సాధించబడ్డాయని పేర్కొన్నారు.గత 15 రోజులుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు,కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న పక్షాలను స్వయంగా కలిసి రాజీ మార్గమే ఉత్తమ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించడంతో లక్ష్యానికి మించి కేసులు పరిష్కరించబడ్డాయని తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందిని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. త్వరలో సిబ్బందికి మరియు ప్రతిరోజూ మానిటరింగ్ చేసిన అధికారులకు రివార్డులు అందజేస్తామని తెలిపారు. కమిషనరేట్లో సమావేశాలు నిర్వహిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన రెండు జోన్ల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిరోజూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ,కోర్టు డ్యూటీలను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులు,సిబ్బంది తదితరులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY