హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడెమీ నల్లవజ్రం, ఉగాది పురస్కారాలను అందజేయడం ప్రశంసనీయం….
అభినందించిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంకె రాజేష్….
…..
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: కోల్ బెల్ట్ ప్రాంతంలో పలు రంగాలలో ప్రతిభావంంతులను గుర్తించి హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడెమీ నల్లవజ్రం, ఉగాది పురస్కారాలను అందజేయడం ప్రశంసనీయమని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంకె రాజేష్ ను అతిథులు అభినందించారు.
తారా ఆర్ట్స్ అకాడెమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక మార్కండేయ కాలనీలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన, ఉగాది కళోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఎన్సీపీ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ మేకల శ్రీధర్ యాదవ్, సాంస్కృతిక సారథి రాష్ట్ర బాధ్యులు అంతడుపుల నాగరాజు, ఇతర అతిథులు మాట్లాడుతూ.. ప్రతి రంగంలోనూ విశేష సేవలందిస్తున్న వారు తమ సేవలకు గుర్తింపుగా ఒక చిన్న ప్రశంస కోరుకోవడం సహజమని, రాష్ట్ర వ్యాప్తంగా కోల్ బెల్ట్ విస్తరించి ఉన్న ప్రాంతాలలో సింగరేణి సంస్థతో బంధం, అనుబంధం ఉన్న కవులు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులు, పాత్రికేయులు, వైద్యులు తదితర రంగాలవారికి అవార్డులు అందజేయడం ప్రశంసనీయమన్నారు.
దేశ, విదేశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తారా ఆర్ట్స్ అకాడెమీ గోదావరిఖని వేదికగా 2021, 2023, 2026 లో కార్యక్రమాలు నిర్వహించిందన్నారు.
కార్యక్రమానికి ముందు అతిథులు, పురస్కార గ్రహీతలకు నిర్వాహకులు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు సంకె రాజేష్ అధ్యక్షత వహించగా, పలు రంగాలకు చెందిన ఈద రామ్ చందర్, పందిల్ల శ్యాం సుందర్, డాక్టర్ జి.రమేష్ బాబు, శ్రీనిధి, జి.మోహన్, బోడకుంట వెంకటరాజం, తిప్పబత్తిని అంజయ్య, గంధం శ్రీనివాస్, కొమ్ము అశోక్ తదితరులకు నల్ల వజ్రం, ఉగాది పురస్కారాలను అందజేయగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ సంగీత విభావరి, కళాకారుల నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు కవ్వంపల్లి స్వామి, దామెర శంకర్, మేజిక్ రాజా, దయా నర్సింగ్, చంద్రపాల్, చీకటి అంజయ్య, కనకం రమణయ్య, చల్లా ప్రవీణ్, గజెల్లి రాజలింగు, పెద్దుల్ల శ్రీనివాస్, నర్సయ్య, పలు జిల్లాలకు చెందిన పురస్కార, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

