ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీయే పార్టీ టిడిపి పార్టీ..
…..
సాక్షిత : పార్టీకి మూల స్తంభాలు కార్యకర్తలు..
రూ. 2.78 కోట్లతో వేగూరులో అభివృద్ధి పనులు..
టిడిపి 44వఆవిర్భావ దినోత్సవం లో ఎమ్మెల్యే వేమిరెడ్డి…
పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పార్టీకి కార్యకర్తలు స్తంభాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం కోవూరు మండలం వేగూరులో టిడిపి “44వ ఆవిర్భావ దినోత్సవ” వేడుకల్లో వారు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి అన్న ఏంటి రామారావు నుండి నేటి లోకేష్ వరకు పార్టీని ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఒక వేగురు గ్రామంలోని 2 కోట్ల 78 లక్షలతో వాటర్ ట్యాంకు,స్మశాన వాటిక,డ్రైన్లు రోడ్లు, పెన్నా పొర్లు కట్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టామన్నారు.
ఎన్నికల సమయాలలో గ్రామాలలో స్మశానవాటికలు త్రాగునీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి తెచ్చారన్నారు. వాటిని దాదాపు అన్ని గ్రామాలలో పూర్తి చేశామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వేగూరు గ్రామంలో 10 మందికి 6లక్ష ల18వేలు ఆర్థిక సాయం అందజేశామన్నారు.
డెల్టా ప్రాంతమైన కోవూరులో రైతులు ఇబ్బంది పడకుండా దాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని, కానీ కొన్ని ఇబ్బందులు అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లగా రేపు సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ రెడ్డిని పరిశీలించవలసిందిగా సూచించారు అన్నారు.
వారు ఇనమడుగు కు సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ రానున్నారని రైతులు సమస్యలు ఉంటే ఆయనకు విన్నవించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మెన్ రాజగోపాల్ రెడ్డి,ఇంతా మల్లారెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, ఎంపీపీ తుమ్మలపార్వతి, వేగూర్ సర్పంచ్ కరెటి అమరావతి,కరెటి శ్రీనివాసులు, తుమ్మల చంద్ర, సుబ్బయ్య నాయుడు, కోవూరు సర్పంచ్ ఏకశిరి విజయ, ఏకశిరి వెంకటరమణ, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి,సాయి తేజ రెడ్డి, బెల్లంకొండ విజయ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

