ఆరోగ్య భద్రతనిస్తూ మెరుగైన వైద్యాన్ని అందించేది ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీ….
….
సాక్షిత : అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరూ లబ్ధిదారులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన ఎల్ఓసీ పత్రాలను చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన లబ్దిదారులకు అందజేశారు.
ఎల్వోసీ పత్రాల అందజేతలో భాగంగా 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ లబ్ధిదారుడు గుద్దిటి రామాంజనేయులు తండ్రి జి. శ్రీరాములు కు 75,000/- (డెబ్భై ఐదు వేల రూపాయలు) మంజూరు కాగా మరొక లబ్ధిదారుడు 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ కు చెందిన రాజబోయిన చంద్రయ్య తండ్రి ఆర్. రామయ్య కు 2.00 లక్షలు (రెండు లక్షల రూపాయలు) మంజూరైన ఎల్వోసీ పత్రాలను ఆయా డివిజన్లకు చెందిన నాయకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీమివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సుధాకర్, కిషోర్ చారి, శ్రీనాధ్, నార్లకంటి బాలయ్య, ఎర్వ సాయి కిరణ్ (బంటి), అర్షద్, ఎండీ. నసీరుద్దీన్, ఆంజనేయులు, రమణా రెడ్డి, కొత్త నర్సింహా రెడ్డి, జయం చారి, కళ్లెం శ్రీనివాస్, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY