జీడిమెట్లలో శ్రీ వెంకటేశ్వర, శివ, వీరాంజనేయ ఆలయ 22వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహణ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర, శివ, వీరాంజనేయ ఆలయ 22వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్, డా. అవిజే జేమ్స్, బేకు శ్రీనివాస్, సిద్దనోల సంజీవరెడ్డి, మైసిగారి శ్రీనివాస్, పండరి రావు, ప్రవీణ్ ముదిరాజ్ శ్రీనివాస్, సుజాత యాదవ్, జ్యోతి, తదితరులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
