రాత్రి వేళల్లో అక్రమ మట్టి దందాలు…! అడ్డుకున్న గ్రామస్తులు…!
….
సాక్షిత పెద్దపల్లి// పెద్దపల్లి జిల్లా:
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో రాత్రిపూట ఎలాంటి అనుమతులు లేని మట్టి దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి సమీపంలోని ప్రసిద్ధ ఎల్లమ్మ గుట్ట నుంచి గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆదివారం గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా పెగడపల్లి ఎల్లమ్మ గుట్ట ప్రాంతం నుండి యదేచ్చగా ఆదివారం తెల్లవారుజాము నుండి వరుసగా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన గ్రామస్తులు ఆరా తీయగా, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఈ తవ్వకాలు సాగుతున్నాయని తేలింది.
దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు టిప్పర్లను నిలిపివేసి అడ్డుకున్నారు. అనుమతి పత్రాలు చూపించమని గ్రామస్తులు అడగగా పొంతన లేని సమాధానాలు చెబుతూ, టిప్పర్ డ్రైవర్లు విఫలం కావడంతో, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించి వాటిని నేరుగా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనుమతులు లేకుండా ప్రకృతి సంపదను, కొందరు దళారులు గుట్టలను కొల్లగొడుతుంటే అధి కారులు ఏం చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
