ప్రజా రంజకమైన బడ్జెట్ను ఓర్వలికి ప్రతిపక్షాల విమర్శలు
అనవసరమైన విమర్శలు మాజీ మంత్రి మానుకోవాలని లేకుంటే తగిన బుద్ధి చెప్తామని ……..ఎమ్మెల్యే హెచ్చరిక
30 లోపు జిల్లాలో కాంగ్రెస్ నూతన కమిటీల పూర్తి
పిఎసి నూతన కమిటీల ఏర్పాటుకు, డిసిసి సొంత కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లా కమిటీ తీర్మానం….. డిసిసి జిల్లా అధ్యక్షులు శివసేనారెడ్డి
…..
సాక్షిత వనపర్తి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 27 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందని ప్రజా రంజకమైన బడ్జెట్ అని అది ఓర్వలేకే ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు కేటీఆర్ లు విమర్శలు గుప్పిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి సరైన సమాధానాలు చెప్పడం జరిగిందని గత మూడేళ్లుగా ప్రజా ఆమోదం యోగమైన పాలన ను తమ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వము ప్రవేశపెట్టని రెండు కొత్త పథకాలను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మొదటిది కోటి 7 లక్షల రేషన్ కార్డు దారులకు కుల మతాలు ఆదాయ తో సంబంధం లేకుండా ఐదు లక్షల బీమా అందించే పథకాన్ని అలాగే రెండవది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకురావడం జరిగిందని2029 లో కూడా తామే అధికారంలోకి రావడం ఖాయమని ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల మేఘ రెడ్డి ధీమాను వ్యక్తం చేస్తూ జోష్యం పలికారు
ఇక వనపర్తి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 2018 వరకు ఉత్తమ నాయకులు నియోజకవర్గ నాయకులుగా ప్రజలు ఎన్నుకోవడం జరిగిందని ఆ తర్వాత నియంత నాయకుడు నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం జరిగిందని అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నిరుద్యోగులు హమాలీ పనులు చేసు కోవాలని విమర్శించడంతో ఆగ్రహించిన నిరుద్యోగ యువత మాజీ మంత్రిపై ఆగ్రహించిన సంగతి మరిచిపోయారా అని మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్సార్ షర్మిల రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో మంగళ వారం మరదలు అని వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించడంతో ఆగ్రహించిన వైఎస్ఆర్సిపి నాయకురాలు షర్మిల వనపర్తి రాజీవ్ చౌరస్తా సాక్షిగా మెట్టుతో కొడతానని హెచ్చరించడం జరిగిందని అలాగే బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తనయురాలు కవిత ను లిక్కర్ రాణివి అని విమర్శించడంతో అనవసరమైన విమర్శలు చేస్తే మాజీ మంత్రి తల పుచ్చకాయల పేలుస్తానని తన తండ్రి వయసు ఉన్న మీరు వయసును గుర్తుచేసుకొని మాట్లాడాలని హెచ్చరించిన విషయం మాజీ మంత్రి మరిచిపోయారని ఎమ్మెల్యే ఎద్దేవ చేశారు
నియోజకవర్గం విషయానికొస్తే పెబ్బేరు సంతకు సంబంధించిన సర్వేనెంబర్ 392 లో 30 ఎకరాల 19 గుంట భూమి విషయంలోనూ అలాగే మెడికల్ కాలేజీ సమీపంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు విషయంలోనూ మాజీ మంత్రి రాద్ధాంతం చేస్తున్నారని పెబ్బేరు సొంత విషయంలో ప్రిన్సిపాల్ సెక్రెటరీ నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందని ఆ చెల్లింపు ఎవరికీ చెల్లింపు చేయాలో తనను అడిగిందని అలాగే భూ యజమానులు నష్టపరిహారం కాకుండా తమకు వేరేచోట భూములు కేటాయించాలని పెబ్బేరు సంత యజమానులుతనకు వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందని వారికి త్వరలో న్యాయం చేయడం జరుగుతుందని అలాగే ఇంటిగ్రేటెడ్ పాఠశాల విషయంలో 2 00 కోట్లతో నిర్మించి పాఠశాలకు 18 ఎకరాలు అవసరం ఉంటుందని ఆల్రెడీ 12 ఎకరాలు ప్రస్తుతం ఉందని ఇక ఏడెకరాలు 45 ఎకరాల మెడికల్ కాలేజీ నుండి తీసుకోనే ప్రయత్నం చేయగా దాన్ని కూడా వారు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరువేనా ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు వనపర్తి లో 20 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని అలాగే ఇంకో 20 ఎకరాలు మీ బినామీలకు ప్లాట్ల రూపేనా ధారధాతం చేసిన మీరు చిత్తశుద్ధి ఉంటే ఆ భూములను తిరిగి వెనక్కి ఇస్తే ఆ భూముల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తామని తెలిపారు
మాజీ మంత్రి తనపై అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కృష్ణానది ఒడ్డున రెండు ఎకరాల భూమిని సొంతం చేసుకున్న అంశం పైన అలాగే తన ఇంటి పని మనిషి పేరు పైన 90 లక్షల సబ్సిడీ ప్రభుత్వ పథకాల ద్వారా తీసుకున్న రుణాల విషయంలో ను అలాగే ఆయన అక్రమాల కుసంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చట్టపరంగా బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే హెచ్చరించారు
చివరగా నియోజకవర్గంలోని మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలు నల్ల ఇంట్రక్షలను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ప్రజల్ని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం డిసిసి చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా స్థాయి నియోజకవర్గ మండల స్థాయి గ్రామస్థాయి వార్డుల కమిటీలను మార్చు ముప్పై లోగా పూర్తి చేయడం జరుగుతుందని నియోజకవర్గ మండల స్థాయి గ్రామస్థాయి మున్సిపాలిటీల వార్డుల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి జండాలను ఎగరవేయడం జరుగుతుందని తెలిపారు
అలాగే రాష్ట్రస్థాయి పిఎసి కమిటీలను జిల్లా స్థాయిలో కూడా పొలిటికల్ అవేర్నెస్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు జెడ్పిటిసిలు ఎంపిటిసిలు కమిటీ మెంబర్లుగా ఏర్పాటు చేసి కార్యకర్తలకు అవేర్నెస్ ప్రోగ్రామ్లను నిర్వహించడం జరుగుతుందని అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

