వెటరన్ రన్నర్ రామ సుబ్బమ్మను. యువత ఆదర్శంగా తీసుకోవాలి విపిఆర్ దంపతుల
*సాక్షిత : కావలికి చెందిన 80 ఏళ్ల బామ్మ, వెటరన్ రన్నర్ రామ సుబ్బమ్మను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు. ఆదివారం నెల్లూరులోని విపిఆర్ నివాసానికి చేరుకున్న ఆమెను విపిఆర్ దంపతులు ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా ఆమె జాతీయ స్థాయిలో సాధించిన పథకాలు చూసి వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వయసులో జాతీయ స్థాయిలో 32 స్వర్ణ, 14 సిల్వర్, 3 బ్రాంజ్ పథకాలు సాధించడం గొప్ప విషయమని చెప్పారు. ఇలాంటివారు ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. సందర్భంగా రామ సుబ్బమ్మ తనకు ప్రభుత్వం తరఫున ఇల్లు కేటాయించేలా చూడాలని ఎంపీ దంపతులకు విజ్ఞప్తి చేయగా వారు తప్పకుండా ఇల్లు కేటాయించేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో రామ సుబ్బమ్మ కుమారులు మహేష్, కుమార్తె జయలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
