బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత,ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక మానవతావాది ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ

Sakshitha news

బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత,ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక మానవతావాది ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 110వ జయంతిని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో నిర్వహించిన జయంతి వేడుకలలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ
బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని , ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడుగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు. సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, తన జీవితకాలం కృషి చేసారని తెలిపారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. బహుజన నేతగా, నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేసారని, తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్ఫూర్తి, మలి దశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి వున్నదని ,కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. రాష్ట్ర ఉద్యానవన విశ్వ విద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో అవార్డులను అందజేస్తూ, చేనేత కార్మికులైన పద్మశాలీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా గణేష్, మహమ్మద్, కరీం మరియు బిక్షమయ్యా, ఆంజనేయులు, ప్రకాష్ ,శివశంకర్, వంగరి విష్ణు, రాములు, వెంకటేశ్వర్లు, నవీన్, నర్సింగరావు, వెంకటనర్సిహ్మ, మోహన్, శ్రీనివాస్, నోముల ఆంజనేయులు, దయానంద్, వేలు తదితరులు పాల్గొన్నారు.