బతుకమ్మ దరరా ఉత్సవాలకు అవసరమగు అన్ని సదుపాయాలు సమకూర్చుతాం – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ప్రతి ఏటా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా నిర్వహించే బతుకమ్మ దసరా ఉత్సవాలు ఈసారి కూడా అంబిర్ చెరువు కట్ట మీద ఘనంగా నిర్వహించే విషయమై ఉత్సవాలు నిర్వహించే ప్రాంగణా స్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా జరుపుకునే బతుకమ్మ దసరా ఉత్సవాలకు వారి సౌకర్యార్థం అవసరమగు అన్ని ఏర్పాట్లును అందిస్తామని అన్నారు. మైదానాన్ని గుంతలు లేకుండా చదునుచేసి, డస్టింగ్, లైటింగ్, మంచినీటి సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంబిర్ చెరువు కట్ట పైన జెసీబీ తో చదును చేసి ఉత్సవాలకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. ఉత్సవాలు జరిగే ప్రాంగణాన్ని మరియు పరిసర ప్రాంతాలను పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయించి బతుకమ్మ ఆడే మహిళల కోసం సిద్ధం చేస్తున్నామని తెలియచేసారు. అలాగే చెరువులో అక్కడక్కడ ఉన్న గుర్రపు డెక్కను కూడా ఎంటమాలజి సిబ్బందితో తొలగిస్తామని అన్నారు. మనంనుందరం కలిసి ప్రతి సంవత్సరంలాగానే ఈసారికూడా బతుకమ్మ దసరా పండుగ ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, విఠల్, భాస్కర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, కె.నరసింహులు, సిద్దయ్య, రాంచందర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల వివరాలు
బతుకమ్మ ఉత్సవాలు
తేదీ : 29-09-2025 సోమవారం రోజున
టైం. : సాయంత్రం 6:00 గంటలకు
స్థలం : శివమ్మా కాలనీ రామాలయం దగ్గర, అంబిర్ చెరువు కట్టమీద
దసరా ఉత్సవాలు
తేదీ : 02-10-2025 గురువారం రోజున
టైం : సాయంత్రం 6:00 గంటలకు
స్థలం : శివమ్మా కాలనీ రామాలయం దగ్గర, అంబిర్ చెరువు కట్టమీద

