దసరా నవరాత్రి ఉత్సవాలు కూకట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి

Sakshitha news

దసరా నవరాత్రి ఉత్సవాలు కూకట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి . ఫతేనగర్ డివిజన్ గౌతమి నగర్ లో కాంగ్రెస్ నాయకుడు జగదీష్ సుశాంత్ ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్నీ టిపిసిసి ఉపాధ్యక్షుడు & జైరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్& కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్ సందర్శించుకున్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్లను అభినందించారు చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, హమీద్, సుశాంత్ ,నాని, దర్పన్ ,ఆకాష్ ,సంగీత్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.