మతపరంగా దేవుడి పేరు వేరైనా అందర్నీ చల్లగా చూసేది ఆ భగవంతుడు

Sakshitha news

మతపరంగా దేవుడి పేరు వేరైనా అందర్నీ చల్లగా చూసేది ఆ భగవంతుడు ఒక్కడేనని టిపిసిసి ఉపాధ్యక్షుడు &జహీరాబాద్ పార్లమెంటు ఇంచార్జ్& కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ మునీర్, అహ్మద్ ఆధ్వర్యంలో ఫతేనగర్ డివిజన్ గౌతమి నగర్ లో జరిగిన గ్యార్మి షరీఫ్ ఉత్సవాలకు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమత సహనంతో ప్రజలు తమ తమ పండుగలను నిర్వహించుకోవాలని సూచించారు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మున్నేర్ ,సయ్యద్ అహ్మద్ , బాబా భాయ్, హమీద్ ఖాన్, ఆసిఫ్ బాబా ,షబ్బీర్ నవీన్ ఖాన్, ఏషిన్, తదితరులు పాల్గొన్నారు.