కొంతమంది కి అవగాహన లేక నవతరం పార్టీ కూడా రద్దు అయిందా

Sakshitha news

కొంతమంది కి అవగాహన లేక నవతరం పార్టీ కూడా రద్దు అయిందా? అని అడుగుతున్నారు.నవతరం పార్టీ రద్దు కాలేదు.నవతరం పార్టీ లైవ్ లోనే ఉంది ఉంటుంది కూడా.ఎన్నికల కమీషన్ పెట్టె అన్నీ నిబంధనలు ఖచ్చితంగా పాటించే పార్టీ నవతరం పార్టీ.

అవగాహన లేని వారికోసం రద్దు అయిన పార్టీలు వివరాలు తెలుపుచున్నాము.. రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

ఏపీలో 22, తెలంగాణలో 22 పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు..! ఈసీ సంచలన నిర్ణయం..భారత ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయని 808 రాజకీయ పార్టీల నమోదును రద్దు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి 22 తెలంగాణ నుండి 22 పార్టీలు ఉన్నాయి.ఆరు సంవత్సరాలుగా ఎన్నికల్లో పాల్గొనని పార్టీల నమోదును రద్దు చేసింది.

ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేయగా.. తాజాగా రద్దు చేసిన 474తో కలిపి మొత్తంగా రెండు నెలల్లో 808 పార్టీలను ఈసీ రద్దు చేసింది. రిజిస్టేషన్‌ రద్దు అయిన పార్టీలు చాలా కాలంగా ఎన్నికల్లో పాల్గొనడం లేదు. అందుకే వాటిని జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఆంధ్ర ప్రదేశ్ నుండి కింద పేర్లు గల పార్టీలు తొలగించడం జరిగింది

తెలుగు రాష్ట్ర శక్తి పార్టీ, తెలుగు బహుజన పార్టీ, జై భారత్ జనసేన పార్టీ, హిందూస్తాన్ రాష్ట్రీయ పార్టీ, భారతీయ బహుజన ప్రజా రాజ్యం పార్టీ, ఆల్ ఇండియా లిబరల్ పార్టీ, ఆల్ ఇండియా మంచి పార్టీ, భారత ప్రజా స్పందన పార్టీ, భారతీయ చైతన్య పార్టీ, భారతీయ సధర్మ స్థాపన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, పేదల పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ & యాక్యూరేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్స్ పార్టీ, ప్రజాపాలనా పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, సమైక్య తెలుగు రాజ్యం, వెనుకబడిన తరగతుల మహిళా రైతుల పార్టీ, వైఎస్ఆర్ బహుజన పార్టీ

ల రిజిస్ట్రేషన్‌ రద్దు అయింది.

తెలంగాణ లో రద్దు అయిన పార్టీ లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, బహుజన సమాజ్ పార్టీ (అంబేద్కర్-పూలె),
ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ,
జాగో పార్టీ,
జాతీయ మహిళా పార్టీ,
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్,
తెలంగాణ కార్మిక రైతురాజ్యం పార్టీ,
తెలంగాణ లోక్ సత్తా పార్టీ,
తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం,
తెలంగాణ ప్రజా సమితి,
తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ,
యువ పార్టీ,
యువ తెలంగాణ పార్టీ,
లోక్‌ సత్తా పార్టీ,
ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ,
ఆల్ ఇండియా బిసి ఓబిసి పార్టీ, బిసి భారత్ దేశం పార్టీ,
భారత్ లేబర్ ప్రజా పార్టీ,
మహాజన మండలి పార్టీ,
నవభారత్ నేషనల్ పార్టీ
తెలంగాణ ప్రగతి సమితి

పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది ఈసీ.అలాగే మరి కొన్ని నెలల్లో ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఏకంగా 42 పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది. ఈ రద్దు తర్వాత దేశంలో ఇప్పుడు ఆరు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా 2,046 రిజిస్టర్‌ పార్టీలు ఉన్నాయి.