అభివృద్ధి – సంక్షేమంలో చంద్రబాబు కాలంతో పోటీపడుతున్నారు : ప్రత్తిపాటి
- సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవడంతో వైసీపీకి నిద్రలేని రాత్రులు
- జగన్ పాలన ప్రజలకు పీడకలగా మిగిలితే… చంద్రబాబు సుపరిపాలన సుఖసంతోషాలు, స్వేచ్ఛా స్వాతంత్ర్యం తీసుకొచ్చింది.
- జగన్ కు రూ.1000 పెంచడానికి ఐదేళ్లు పడితే.. చంద్రబాబు కేవలం 5 రోజుల్లో పింఛన్లు రెట్టింపు చేసి పేదలకు పెద్దదిక్కుగా నిలిచాడు
- తల్లికి వందనం, స్త్రీశక్తి పథకాలతో ప్రభుత్వం మహిళల మనసులు గెలిచింది
- అన్నాక్యాంటీన్లతో పేదల కడుపునింపుతున్న నాయకుడు చంద్రబాబు
- కేవలం 150 రోజుల్లో మెగా డీఎస్సీ అమలుతో లోకేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు
- అన్నదాతా సుఖీభవ పెట్టుబడిసాయం రైతులకు వరం
- 13,226 గ్రామసభల నిర్వహణ.. రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు ప్రజాప్రభుత్వ పనితీరుకు నిదర్శనం
- సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అంశంపై శాసనసభలో జరిగిన లఘుచర్చలో మాజీమంత్రి ప్రత్తిపాటి.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవడంతో వైసీపీ నిద్రలేని రాత్రుళ్లు అనుభవిస్తోందని, గత ఐదేళ్ల పాలన ప్రజలకు పీడకలగా మిగిలిందని, సమస్త వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, అలాంటి స్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి చంద్రబాబుకు 15 నెలలు పట్టిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
శనివారం శాసననసభలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ అన్న అంశంపై చేపట్టిన లఘుచర్చలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కాలంతో పోటీపడుతూ.. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజల అంచనాలకు మించి కూటమిప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి, సంక్షేమమనే జోడు గుర్రాలపై సవారీ చేస్తోంది. జగన్ రెడ్డి అంతగా ఆర్థిక విధ్వంసం చేసినా ఇన్ని పథకాలు.. సకాలంలో ఎలా అమలుచేస్తున్నారని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారని ప్రత్తిపాటి చెప్పారు.
రూ..1000పెంచడానికి జగన్ ఐదేళ్లు పడితే.. చంద్రబాబు 5 రోజుల్లో పింఛన్ రెట్టింపు చేశాడు
ఐదేళ్లలో జగన్ పెంచలేని సామాజిక పింఛన్లను చంద్రబాబు కేవలం 5 రోజుల్లోనే పెంచాడని, రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచిన ఘనత ఆయనదేనని ప్రజలే చెబుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. జగన్ కు రూ.1000 పెంచడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. 64 లక్షల మందికి కేవలం పింఛన్లకే 15నెలల్లో రూ.45వేల కోట్లు పంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదని ప్రత్తిపాటి కొనియాడారు. పింఛన్ల పెంపులో జగన్ మాటలకు పరమితమైతే, చంద్రబాబు చేతల్లో నిరూపించాడని ప్రజలే చెప్పుకుంటున్నారన్నారు.
తల్లికి వందనం అమలుతో కూటమిప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది.
తల్లికి వందనం పథకం అమలుతో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని, గతంలో జగన్ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే కేవలం ఒక్కరికే అమ్మఒడి ఇచ్చి మోసగించాడన్నారు. ఆ సొమ్ముకూడా తర్వాత నాన్నబుడ్డి పేరుతో రూ.30వేలకోట్లు తిరిగి తనఖజానాకే చేర్చాడన్నారు. కానీ నేడు యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో 64 లక్షల మంది విద్యార్థులకు ఒకేరోజు తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగిందన్నారు.
అన్నదాతా సుఖీభవ కింద 47లక్షల రైతాంగానికి పెట్టుబడి సాయం
అన్నదాతా సుఖీభవ కింద ఇప్పటికే ప్రభుత్వం రూ.7వేల తొలివిడత సాయం రైతులు ఖాతాల్లో వేసిందని, మిగిలిన సొమ్మును కూడా త్వరలోనే జమచేస్తుందని ప్రత్తిపాటి చెప్పారు. ఏడాదికి రూ.20వేల పెట్టుబడి సాయం 47 లక్షల మంది రైతాంగానికి ప్రభుత్వం అందచేస్తోందన్నారు.
స్త్రీశక్తి పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతోంది.
స్త్రీ శక్తి పథకం కింద ఇప్పటికే 5కోట్ల మంది బస్సుప్రయాణాన్ని వినియోగించుకున్నారని, ఏటా ఆర్టీసీపై రూ.2వేలకోట్ల భారం పడుతోందన్నారు. ఈ పథకం వల్ల ఉపాధి, ఉద్యోగాలు చేసుకునే మహిళలకు మంచి లబ్ధి కలుగుతోందన్నారు.
కేవలం 150 రోజుల్లో మెగాడీఎస్సీ అమల్లో లోకేశ్ కృషి అసామాన్యం..
మెగా డీఎస్సీని సాకారం చేయడం ద్వారా ప్రభుత్వం వేల కుటుంబాల్లో దసరా పండుగ సంతోషాన్ని ముందే తీసుకొచ్చిందన్న ప్రత్తిపాటి, నియామకపత్రాలు అందుకున్న అభ్యర్థుల కళ్లల్లోని ఆనందమే అందుకు నిదర్శనమన్నారు. కేవలం 150 రోజుల్లోనే డీఎస్సీని పారదర్శకంగా అమలు చేయడంలో మంత్రి లోకేశ్ కృషి అసామాన్యమని, డీఎస్సీ నిర్వహణకు అడ్డుపడుతూ న్యాయస్థానాల్లో వేసిన 100కు పైగా పిటిషన్లను పరిష్కరించి మరీ నూతన ఉపాధ్యాయుల కల నిజం చేశాడని ప్రత్తిపాటి తెలిపారు
జగన్ పేదల నోటికాడ కూడు తీస్తే..చంద్రబాబు మూడుపూటలా వారి కడుపు నింపుతున్నారు.
204 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో ప్రభుత్వం పేదల కడుపు నింపుతోందని, రెక్కాడితే గానీ డొక్కాడని ఎందరో కూలీలకు ఈ క్యాంటీన్లు ఎంగానే ఉపయోగపడుతున్నాయని ప్రత్తిపాటి తెలిపారు. జగన్ రెడ్డి పేదల నోటివద్ద కూడు లాగేసి క్షమించరాని తప్పు చేశాడన్నారు. అధికారంలోకి వచ్చీ రాగానే చంద్రబాబు పేదల ఆకలి బాధ తీర్చాడన్నారు. పథకాల్లో అమల్లో భాగంగా అతి త్వరలోనే ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద ఆటోడ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15వేలు అందించనుందన్నారు.
పథకాలే కాకుండా వర్గాల వారీగాప్రజలకు పలురకాల రాయితీలు, సబ్సిడీలు అందిస్తున్న ఘనత కూటమిప్రభుత్వానిదని బీసీలకు గృహ నిర్మాణం కోసం రూ.50 వేలు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు రూ.98 వేల వరకు సబ్సిడీ అందిస్తోందన్నారు.
13,226 గ్రామసభల నిర్వహణ.. రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు ప్రజాప్రభుత్వ పనితీరుకు నిదర్శనం
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పూర్తి సానుకూలతతో ఉందని, వేగంగా జరిగే పనులే అందుకు నిదర్శమని ప్రత్తిపాటి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో 13,326 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడం ప్రపంచ రికార్డ్ అని ప్రత్తిపాటి తెలిపారు. పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం వేగంగా పనిచేయడం సామాన్య విషయం కాదని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అమలు చేసిన యూనివర్శల్ హెల్త్ పాలసీ, రూ.25లక్షల ఆరోగ్యబీమా అందించడం పేదలకు వరమన్నారు. దేశవిదేశాల్లోని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి తొలుత ఏపీకే ప్రాధాన్యత ఇస్తున్నారని, దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్న బ్రాండే నిదర్శనమన్నారు. రాష్ట్రానికి రూ.10 లక్షలకోట్ల పెట్టుబడులు రావడం జరిగిందన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ప్రభుత్వం త్వరలోనే సాధ్యం చేస్తుందని, ఇప్పటికే 7లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. పోలవరం-అమరావతి నిర్మాణ పనులు రెట్టింపు స్పీడ్ తో జరుగుతున్నాయని, బాద్యతాయుతమైన ప్రజా ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని ప్రత్తిపాటి సభసాక్షిగా స్పష్టంచేశారు.
