కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకే: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన బీమ్ భరత్
సాక్షితశంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకే ఇస్తామని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన బీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
గ్రామస్థాయి, మండల స్థాయి, మున్సిపల్ వార్డులలో కమిటీలను వేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఆరు గ్యారంటీ పథకాల కొరకు కమిటీ వేసి, ఐదు మందికి చోటు ఇచ్చి, వారు అర్హులైన లబ్ధిదారును ఎంపిక చేయాలన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను కూడా మండల, మున్సిపల్ స్థాయిలో వేస్తామన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే తిప్పి కొట్టాలని కార్యకర్తలకు తెలిపారు. ప్రజలకు అండగా ఉంటానన్నారు. కార్యకర్తలు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరిస్తానని పేర్కొన్నారు.