వాలంటీర్ల సేవలు అద్భుతం

Spread the love

ప్రజల ముంగటికి సేవలందిస్తున్న వాలంటీర్లకు వందనం..

ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటిని ప్రజల ముంగిటకి చేరుస్తున్న వారధులు మా వాలంటీర్లు..

మా వాలంటీర్లంటే ప్రతిపక్షాలకు భయం..

నరసరావుపేట రూరల్ మండలంలో 532 మంది వాలంటీర్లకు గాను 501 మందికి సేవా మిత్ర అవార్డులు..

వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు వందనం మహోత్సవ కార్యక్రమం నిర్వహించాం..

-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..

గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు అద్భుతం అని వారి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని పేదలకు మెరుగైన సేవలను అందించగలుగుతున్నామని నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు..నరసరావుపేట ఎం.డి.ఓ కార్యాలయంలో నరసరావుపేట మండల రూరల్ గ్రామాలకు సంబంధించిన వాలంటీర్లకు వందనం మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు డా౹౹ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులు పొందిన వాలంటీర్లకు పురస్కారాలను అందజేసి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డా౹౹ గోపిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట రూరల్ మండలంలో 532 మంది వాలంటీర్లకు అవార్డులు వరించాయని వారిలో 501 మందికి సేవా మిత్ర, ఐదుగురికి సేవా రత్న, ఇద్దరికీ సేవలు వజర అవార్డులు రావడం జరిగిందని అవార్డు పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా శాసనసభ్యులు డా౹౹ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఇప్పటివరకు సంక్షేమ పథకాలు ముఖం కూడా చూడనటువంటి వారికి కూడా వారి దరికి చేర్చినటువంటి వ్యక్తులు వాలంటీర్లు అన్నారు…మిగిలిన రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక కొత్త ఆలోచనకు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక నమూనా కావడం సంతోషదాయకమన్నారు. గతంలో సేవా మిత్రా, సేవా రత్న, సేవా వజ్రాలకు అవార్డు రూపంలో అందజేసినటువంటి పారితోషికాన్ని కూడా పెంచడం జరిగిందని సేవా మిత్రాకు 15000 సేవా రత్నాకి 30,000 సేవా వజ్రాకు 45000 ఈ ప్రభుత్వం పెంచి ఇస్తున్నట్లుగా డా౹౹ గోపిరెడ్డి వెల్లడించారు. సేవ చేసే వ్యక్తులను గౌరవించాలి అనేటువంటి ఆలోచన అద్భుతమని ఈ ఆలోచన ద్వారా ప్రజలకు వాలంటీర్ల ద్వారా మరింత సేవలు అందించాలనే పోటీ తత్వాన్ని ప్రేరేపించడం….ప్రతి ఒక్కరూ తమకు తాముగా అవార్డు పొందాలి అనేటువంటి లక్ష్యాలు నిర్దేశించుకునేలా ప్రభుత్వం ఆలోచన చేయడమైనది శుభ పరిణామం అన్నారు…

యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం…డా౹౹ గోపిరెడ్డి ..

అలాగే ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, మరో రెండు నెలలు పేదల బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2 లక్షల 60వేలు నా సైన్యం. టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమన్నారు. తాము ఏర్పాటు చేసిన వ్యవస్థలు గ్రామ రూపు రేఖలను మార్చేశాయని, గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అర్బీకే వ్యవస్థ రైతులకు కొండంత అండగా నిలబడిందని చెప్పారు. ఇది జన్మభూమి కమిటీలు, వాలంటీర్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు..

చంద్రబాబు పాలన విష వృక్షం..

గత పాలనలో స్కీమ్ లు లేవు..,బటన్ లు లేవు..చంద్రబాబు పాలన విష వృక్షమైతే..తమ పాలన కల్ప వృక్షమన్నారు..రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరుగుతాయని.. పేదలకు మంచి చేసే యజ్ఞంలో వాలంటీర్ల సేవలు చిరకాలం కొనసాగేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తూ, ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని మరింత పెంచి అందిస్తున్న జగనన్న ప్రభుత్వం అని నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు..ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఎంపీపీ, వైస్-ఎంపీపీ, మండల కన్వీనర్, ఎంపిటిసిలు, సర్పంచులు, ఉప-సర్పంచులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు, సచివాలయ కన్వినర్ లు, సచివాలయ గృహసారధులు, సోషల్ మీడియా కన్వీనర్ లు, జగనన్న అభిమానులు మరియ వివిధ హోదాలలో ఉన్న నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page