SAKSHITHA NEWS

తెలంగాణ వైద్యుల సేవలు మరువలేనివి – ఎమ్మెల్యే చిరుమర్తి

— వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానం – ఎమ్మెల్యే

— ఉత్తమ వైద్యులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందజేత

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. చిట్యాల
పట్టణంలోని లక్ష్మీ గార్డెన్లో
నల్లగొండ జిల్లా డిఐఓ డా. మహమ్మద్ అబ్దుల్ జమీర్ అధ్యక్షతన నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ వైద్య సేవలు అందించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9సం.లు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి వెళ్తున్న
సందర్భంగా ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలలో గాని ఏరియా ఆసుపత్రులు హెల్త్ సెంటర్ల లో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలంటే ప్రజలు భయపడే వారనీ గతంలో చూస్తే గ్రామాలలో మలేరియా డెంగ్యూ వివిధ రకాల వ్యాధులతో ఎంతోమంది చనిపోయే వారని కానీ తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాల రేటును మొత్తం తగ్గించారని ఆ విధంగా వైద్య రంగాన్ని పటిష్టం చేశారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత లోని లోపాలను గత ప్రభుత్వాలు అధికారులు పట్టించుకోలేదని కానీ ఈరోజు పరిశుభ్రత వైద్య సేవలు అందించడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారని ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుకి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కరోనా సమయంలో వైద్యులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు చేసిన కృషి చాలా గొప్పదని అన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ లను బస్తీ దవాఖానాలని విస్తృతం చేసి అభివృద్ధి చేయాలని సంకల్పంతో ప్రభుత్వం ఉన్నదని అన్నారు.

నియోజకవర్గానికి 26 హెల్త్ సెంటర్లను మంజూరు చేయించుకున్నామని అన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉత్తమ వైద్యులు, ఉత్తమ ఎఎన్ ఎం లు, ఉత్తమ ఆశా వర్కర్ల కి ప్రశంసా పత్రాలను జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య యాదవ్, జెడ్పీటీసీ సుంకరి దనమ్మ యాదగిరి గౌడ్, రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం యాదవ్, నార్కట్ పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి ఎంపిడిఓ లాజర్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, కేతేపల్లి జెడ్పీటీసీ స్వర్ణలత, మున్సిపాలిటీ కమిషనర్ మందడి రామదుర్గా రెడ్డి, డిప్యూటీ ఎమ్మార్వో రాగ్యా నాయక్, నకిరేకల్ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డా.శిరీష, రామన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డా.వీరన్న, యాదాద్రి భువనగిరి జిల్లా డిఐఓ డా. పరిపూర్ణాచారి ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు, వైద్యాధికారులు డా. గట్టు కిరణ్ కుమార్, డా. అశ్విన్ కుమార్, డా. సత్య ప్రకాష్, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, వైద్యాధికారులు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS