గురుదత్తా ఫౌండేషన్ సేవలు విస్తృత పరచి, విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు సేవలు అందించాలి
-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
గురుదత్తా ఫౌండేషన్ సేవలు విస్తృత పరచి, విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి ఖమ్మం అర్బన్ మండలం పోలేపల్లి లోని గురుదత్తా ఫౌండేషన్ సందర్శించి, ఈత మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల కోరిక, ఆకాంక్షల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురుదత్తా ఫౌండేషన్ కు రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు, అప్రోచ్ రహదారులు చేపట్టాలని అన్నారు. రహదారి వెంబడి కావాల్సిన విద్యుత్ లైన్, స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. నది ఒడ్డున సౌకర్యాలు కల్పించి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పన చేయాలన్నారు. మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలన్నారు. రెవిన్యూ అధికారులు సర్వే చేపట్టి, హద్దులు ఫిక్స్ చేయాలన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ప్లాన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రణాళిక చేయాలన్నారు. దానవాయిగూడెం చెక్ డ్యామ్ ఎత్తు పెంచాలన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు ఆలోచన చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపిందించాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పామాయిల్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎస్ఇ చంద్రమౌళి, ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి రమణ, ఇర్రిగేషన్ ఇఇ వెంకటేశ్వర రావు, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, పట్టణ ఏసీపీ తిరుపతి రెడ్డి, గురుదత్తా ఫౌండేషన్ వి. లక్ష్మయ్య, సిహెచ్. వెంకటేశ్వర రావు, శంకరయ్య, కృష్ణయ్య, ప్రభాకరరావు, ప్రసాద్, రాంరెడ్డి, గోపాల్ రావు, మల్లారెడ్డి, రాయల నాగేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.