SAKSHITHA NEWS

ఎమ్మెల్యేగా పోటీ చేయండి మీ వెంట మేముంటాం..
చాకలి ఐలమ్మ స్పూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదాం..
అతిపెద్దదైన ఐలమ్మ విగ్రహంతో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు..
నీలం మధుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి..
గెలిపించి మీ చేతిలో పెడతాం..
కేసీఆర్ ను కోరిన పటాన్చెరువు నియోజకవర్గ మెజార్టీ రజకులు..
తమ పూర్తి మద్దతు నీలం మధు కె అంటూ ప్రకటన…

పటాన్చెరువు బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పునరాలోచించాలని ఇస్నాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రజక సంఘం నేతలు

చిట్కుల్ గ్రామంలో నీలం మధు ఏర్పాటుచేసిన ఐలమ్మ కాంస్య విగ్రహనికి ర్యాలీగా వెళ్లి పూలమల వేసి సమావేశం ప్రారంభించారు

పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ బాలాజీ ఫంక్షన్ హాల్లో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి వెంకటేష్ ఆధ్వర్యంలో పటాన్చెరువు నియోజకవర్గ స్థాయి రజకుల ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు…

పటాన్ చెరు బీ అర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తృటిలో అవకాశం కోల్పోయిన నీలం మధు ముదిరాజ్ కు సబ్బండ వర్గాల ప్రజల మద్దతు రోజు రోజు కు పెరుగుతుంది. నీలం మధు కు మద్ధతుగా అన్ని బీసీ వర్గాలు ఏకమవుతున్నాయి. ఐక్యమత్యంతో ముందుకు సాగి నీలం మధు ను ఎమ్మెల్యే గా గెలిపించాలని డిసైడ్ అవుతున్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ ను ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ నీలం కు కేటాయిస్తే గెలిపించి మీ చేతిలో పెడతామంటూ భరోసా ఇస్తున్నారు. మరొక అడుగు ముందుకు వేసి అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామని మా అందరి మద్దతు మీకే ఉంటుందని తేల్చి చెప్తున్నారు.

నీలం మధుకు తోడుగా పటాన్చెరు నియోజకవర్గ మెజారిటీ రజక సంఘలు కదిలాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తమ సామాజిక వర్గం అంతా కదిలి నీలం మధును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి తమకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నీలం మధు బాటలోనే మేమంతా పయనిస్తామని రజకులు వెల్లడిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో కేసీఆర్ బీసీ వర్గాలను మోసం చేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న రజకులకు ఒక టికెట్టు కూడా కేటాయించకపోవడం తప్పు పట్టారు,పటాన్ చెరు నియోజకవర్గంలో మెజారిటీ బీసీలున్నారని దానికి తోడు సబ్బండ వర్గాల పక్షాన నీలం మధు ముదిరాజ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నారన్నారు.

అటు మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ వారి గాధలను భవిష్యత్తు తరాలకు తెలియజేసే ఉద్దేశంతో వారి పోరాటాన్ని గుర్తుచేసేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించుకొని పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు. నీలం కు టికెట్ ఇస్తే అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు సాగి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకొని తమ ముందుకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. లేని పక్షంలో పోరాటం తమకు కొత్త కాదని చాకలి ఐలమ్మ వారసులుగా తమ వర్గం అంతా నీలం మధు పక్షాన నిలబడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తామంతా చొరవ తీసుకొని నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా మరిన్ని బహుజన సామాజిక వర్గాలను ఏకం చేసి సామాజిక న్యాయం, రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తామని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మండల అధ్యక్షులు గణేష్, గుమ్మడిదల మండల అధ్యక్షులు వీరెష్,అమీన్పూర్ మండలాధ్యక్షులు నాగేష్, రామచంద్రపురం మండల అధ్యక్షులు నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోచయ్య,లక్ష్మణ్, ఆశయ్య,రవి,సందీప్,గోపాల్,నారాయణ, సురేశ్,బాలకృష్ణ, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS