పంట నష్టం ఫై డేటా నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి.
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
పంట నష్టం ఫై డేటా నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ వ్యవసాయ శాఖ కార్యాలయంను సందర్శించి డేటా నమోదు ప్రక్రియ ను పరిశీలించారు. జిల్లాలో పంట నష్టం జరిగిన రైతుల వద్ద క్షేత్ర స్థాయిలో సేకరించిన డేటా ను అప్లోడ్ చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. రైతులు నష్టపోకుండా పంట నష్టం అంచనా వేయాలని, అప్లోడ్ చేసేటప్పుడు సరిచేసుకోవాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయనిర్మల, అధికారులు, సిబ్బంది తదితరులు వున్నారు.