SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రధాత..జన హృదయనేత..తెలంగాణ జాతిపిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా సమతా నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ స్వాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, ఉద్యమ నాయకుడు అని కొనియాడారు. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడని అన్నారు. కారణ జన్ముడైన కెసిఆర్ చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.


SAKSHITHA NEWS