SAKSHITHA NEWS

The people of the fifth ward are in trouble

ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పక్కదారి పట్టించిన నాయకులు, మా ఓట్లు వద్ద అని ప్రశ్నిస్తున్న వార్డు ప్రజలు
ఎలక్షన్ కోడ్ అనంతరం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘర్షణ దీక్ష*


సాక్షిత వనపర్తి : మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో 15 సంవత్సరాల క్రితం వేసిన వెంచర్లో ఇండ్లు కట్టుకున్న ప్రజలకు కాలువలు సిసి రోడ్లు లేక 20వ వార్డు నుంచి వచ్చే వరదకు దారి లేక వరద నీటి నిల్వతో పందుల ఆవాసాల, వాసన లతో రోగాల బారిన పడుతున్న వార్డు ప్రజల దుస్థితి వర్ణనాతీతంగా మారిందని పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యే మెగారెడ్డిని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి రాకుండా దారి మళ్లించుకుపోవడం దారుణం అని ఇది వారి నిర్లక్ష్యానికి తార్ఖానమని అఖిలపక్ష నాయకులు వారిపై ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డు ప్రజలు మా ఓట్లు వద్ద అని ప్రశ్నిస్తున్నారు వార్డులో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పార్లమెంటు ఎన్నికల అనంతరం అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజాసంఘర్షణ పేరుతో దీక్ష చేపడతామని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈ సందర్భంగా నాయకులను అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు రమేష్ ఎస్సీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు నాయకులు బొడ్డుపల్లి సతీష్ కుమార్ కురుమూర్తి శివకుమార్ రాములు భాను వాడు ప్రజలు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

The people of the fifth ward are in trouble

SAKSHITHA NEWS