శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలే నా బలగం ,
బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలం
*బీఆర్ ఎస్ పార్టీ కి పార్టీ కార్యకర్తలే శ్రీరామ రక్ష
8500 కోట్ల తో శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి
ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
సాక్షిత : ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, పురపాకల శాఖ మంత్రి , బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో హుడా కాలనీ లో జరిగిన హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో బీఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ , కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఆదేశాల మేరకు మరియు మంత్రివర్యులు బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ నాయకుల,కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని , బీఆర్ ఎస్ పార్టీ చేసిన ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అని, సాధించుకున్న రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని,పరిపాలనా విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని,నేడు యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విదంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనకు నిదర్శనం అని, కోట్ల నిధులు వెచ్చించి శేరిలింగంపల్లి నియోజకవర్గను అభివృద్ధి చేసుకున్నాం అని,తప్పుడు కధనాలు సృష్టించే ప్రతిపక్ష పార్టీల నాయకుల దుశ్చర్యలను తిప్పికొట్టే బాధ్యత మనందరి పైన ఉంది అని తెలిపారు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచుతూ అడ్డగోలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచారు అని, ప్రతిపక్షంలో ఉన్నపుడు మోడీ మాట్లాడుతూ గ్యాస్ ధర ను 400 రూపాయల నుండి 200 వరకు తగ్గిస్తామని చెప్పి అధికారంలో కి రాగానే ప్రధాని కాగానే గ్యాస్ ధర ను1200 రూపాయలకు పెంచారు అని ,ప్రతి ఒక్కరు జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తెరవండి ఒక్కొక ఖాతాలో 15,00,000 లక్షలు వేస్తామని అసత్యపు ప్రచారాలు చేసి అధికారంలోకి రాగానే 15 రూపాయాలు కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు, మియాపూర్ నుండి BHEL వరకు మెట్రో విస్తరణ చేపట్టామని కేంద్ర ప్రభుత్వం ను మన రాష్ట్ర ప్రభుత్వం కోరగా సరిపడా ట్రాఫిక్ లేదు అని మెట్రో విస్తరణను అడ్డుకున్నారు అని కేంద్ర ప్రభుత్వం పై ప్రభుత్వ విప్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు .గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలోకి చేరేవిదంగా ప్రతి ఒక్కరు కృషిచేయాలని తెలిపారు. ఎనిమిదేళ్ల లో ఏమి చేసామని మరియు రాబోయే రోజులలో ఎం చేయబోతున్నాం అని ప్రజలకు వివరించాలని అదేవిధంగా దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అనే విషయాన్ని మరోసారి చాటి చెప్పాలి.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేవలం బీఆర్ ఎస్ పార్టీ అని మరియు అదేవిధంగా బీఆర్ ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని,ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా చూసుకుంటాం..కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్ములు అని ,బీఆర్ ఎస్ పార్టీ యే మనకు శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ పార్టీ ని బ్రతికిస్తే అది మనల్ని బ్రతికిస్తుంది అని,పార్టీ బాగుంటే మనం బాగుంటం అని కావున ప్రతి ఒక్కరు పార్టీ అభ్యున్నతి కోసం సిపాయిలగా కష్టపడాలి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కున్నారు.
దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్య మంత్రి కెసిఆర్ అని ,క్రమశిక్షణ తో బాధ్యతాయుతంగా పని చేయాలని, పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేసి పార్టీ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీ ఆదేశాల ను శిరసవహించాలని , మీకు అప్పగించిన బాధ్యతలు క్రమశిక్షణ తో నెరవేర్చాలని ,
ప్రజలకు పార్టీ కి వారధిగా ఉండలని , పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం తప్పకుండా లభిస్తుంది అని
కావున ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు సిపాయిలగా కష్టపడి పని చేయాలని , పని చేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా మంచి గుర్తింపు లభిస్తుంది అని ,
బీఆర్ ఎస్ పార్టీ కి ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని,
బీఆర్ ఎస్ పార్టీ పదవులు పొందిన వారు క్రమశిక్షణ తో బాధ్యతాయుతంగా పని చేయాలని, పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేసి పార్టీ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలని, పార్టీ ఆదేశాల ను శిరసవహించాలని , మీకు అప్పగించిన బాధ్యతలు క్రమశిక్షణ తో నెరవేర్చాలని , ప్రజలకు పార్టీ కి వారధిగా ఉండలని , పదవులు రాని వారు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని , పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం తప్పకుండా లభిస్తుంది అని కావున ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు సిపాయిలగా కష్టపడి పని చేయాలని , పని చేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా మంచి గుర్తింపు లభిస్తుంది అని , నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యే ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వారీగా ఉండాలని మరియు నిత్యం ప్రజల మధ్యే ఉండే నాయకులను ఎన్నుకోవాలని ,ప్రజల సమస్యలు తెలిసినవారు,డివిజన్ మొత్తం తెలిసినవారు ,పార్టీ కోసం కష్టపడినవారికి, ఉద్యమకారులకు ,పార్టీ అభ్యున్నతికి పాటుపడేవారికి సముచిత స్థానం కలిపిచామని ,పార్టీ అభివృద్ధికి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను సముచిత స్థానం కలిపిస్తామని,పార్టీ కోసం కార్యకర్తలు ,నాయకులూ సిపాయిలుగా పనిచేయాలని ,ప్రభత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని, పార్టీ కి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం జరిగినది ,ఎన్నుకోబడిన నాయకులు గౌరవంగా పనిచేయాలని అప్పుడే క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు గుర్తింపు వచ్చేలా పని చేయాలనీ కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగినది అన్ని డివిజన్ల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.
,,,,,,,,,,,,,,,,,