సి.పి.ఆర్ తో 50 శాతం గుండె పోటు మరణాలు తగ్గించవచ్చు

Spread the love

సి.పి.ఆర్ తో 50 శాతం గుండె పోటు మరణాలు తగ్గించవచ్చు
సిపిఆర్ పై ప్రతీ ఒక్కరికీ వైద్య శాఖ అవగాహన కల్పించాలి
సూర్యాపేట కలెక్టరేట్ లో సిపిఆర్ పై శిక్షణా తరగతులు , ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి*


సాక్షిత సూర్యాపేట : ఆకస్మిక గుండెపోటు వల్ల వ్యక్తులు మరణించకుండా సిపిఆర్ చేయడం వలన ప్రాణాలను కాపాడినవారం అవుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సిపిఆర్ పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ఆకస్మిక గుండెపోటు వల్ల అనేకమంది మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు బాధను కలిగిస్తున్నాయని, ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్డియో పల్మనరీ రీససీటేషన్ పై వైద్య ఆరోగ్యశాఖతోపాటు సాధారణ ప్రజలందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వ హించాలన్నారు. జీవన విధానంలో మార్పులు, వాతావరణ లో మార్పులు, ఆహారపు అలవాట్లు, ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిమాణాలు, పని ఒత్తిడి, పనులలో పోటీ తత్వం, మనిషి యొక్క ఆశలు ఎక్కువగా పెంచుకోవడం వల్ల మనసు మీద ఒత్తిడి ఎక్కువ అవుతుందని, తదితర కారణాలవల్ల వయస్సు నిమిత్తం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

సిపిఆర్ శిక్షణ వల్ల 50 శాతం గుండెపోటు మరణాలను తగ్గించవచ్చని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో వేగంగా మార్పులు తీసుకువచ్చిందని, గతంలో ప్రభుత్వ దవాఖానాలకు పోవద్దని దానిపై పాటలు కూడా పాడేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పై నమ్మకం ఏర్పడడంతో ప్రజలు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులను వెళుతున్నారని ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు బాగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. గతంలో సిబ్బంది కొరత ఉండేదని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబ్బందిని నియమాకాలు చేపట్టిందని ,ప్రభుత్వ దవాఖానాలు ప్రైవేటు దావాఖానాలకు దీటుగా నడుస్తున్నాయని మంత్రి అన్నారు. ఆకస్మికంగా వచ్చే గుండెపోట్లను చిన్న ప్రయత్నంతో ఒక ప్రాణాన్ని నిలువచ్చని మంత్రి తెలిపారు. సి .పి.ఆర్ ఫై ప్రతి కుటుంబానికి తెలిసేలా అవగాహన కల్పించాలని, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మంత్రి ఆదేశించారు.


జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ మాట్లాడుతూ కోవిడ్ తర్వాత మారిన పరిస్థితులకు వాతావరణ మార్పులకు వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారని దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సిపిఆర్ పై ముందుగా మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తరువాత రాష్ట్రంలోని ప్రజలందరికీ శిక్షణ ఇవ్వడం చేస్తున్నదని, ముందుగా వైద్య సిబ్బందికి తర్వాత పోలీసు మిగిలిన అన్ని శాఖలకు, ఐదుగురు రిసోర్స్ పర్సన్ ద్వారా ట్రైనింగ్లు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. గుండెపోటు వచ్చి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే లోపు సిపిఆర్ ఇచ్చినట్లయితే మనిషి బ్రతికేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ అన్నారు. తీసుకున్నవారు వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వాలని దీనిని సామాజిక బాధ్యతగా తీసుకున్నట్లయితే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు అని కలెక్టర్ తెలిపారు.
అనంతరం మంత్రి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సిపిఆర్) చేయు విధానాన్ని మంత్రి ట్రైనర్స్ సలహా మేరకు చేసి చూపించారు .అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్ సిపిఆర్ పై శిక్షణ పొందిన వారికి ధృవ ప్రతాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జెడ్పి చైర్మన్ గొప్పగాని వెంకటనారాయణ గౌడ్ ,జడ్పిటిసి జీడి బిక్షం, జిల్లా ఆధనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు,డి.యం.హెచ్.ఓ డాక్టర్ కోటచలం, డిప్యూటీ డి.యం. హెచ్. ఓ హర్షవర్ధన్, సి పి ఆర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాసరాజు జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , కార్యాలయ ఎ.ఓ శ్రీదేవి, ఆర్డిఓ రాజేంద్రకుమార్, డిఎస్పి నాగభూషణం, భాస్కర్ రాజు భూతరాజు సైదులు మాస్టర్ ట్రైనిస్ ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page