పగలగొట్టారు పనులు మరిచారు అంటున్న షాపు యజమానులు
బాపట్ల పట్టణంలో అభివృద్ధి పేరుతో త్రవ్వకాలవ వద్ద నుండి చీలురోడ్డు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వరకు ఒకపక్క షాపులు ముందు మెట్లు పగలకొట్టి సుమారు 6 నెలలు కాలం అవుతున్నా కానీ ఇప్పటివరకు తిరిగి వాటి ముఖం ఏ అధికారి చూడలేదు.
పగల కొట్టిన వాటి స్థానంలో డ్రైనేజీ ఏర్పాటు చేస్తారో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో షాపుల యజమానులు,
కరోనా తో రెండు సంవత్సరాలు వ్యాపారాలు లేక ఇబ్బంది పడి, ఇప్పుడు అభివృద్ధి పేరుతో ఈ మెట్లు పగలగొట్టడం వల్ల మరలా వ్యాపారాలు లేక అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నాం అంటున్నా షాపు యజమానులు
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆగిపోయిన పనులను వెంటనే చేయాలని లేదంటే మేము రోడ్డున పడాల్సి పరిస్థితి వస్తుందని లబోదిబో మంటున్న షాపు యజమానులు.