సాక్షిత న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
బిఆర్ఎస్ కు కాలం చెల్లె రోజులు వచ్చాయి
అశ్వారావుపేట మండల క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం లో మాజీ ఎంపి పొంగులేటి : అరవై ఏళ్ళు పోరాటం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి నాయ్యం చేకురలేదని….. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే ఉపయోగపడింది అని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఎంతో మంది మేధావులు కృషి, నిరుద్యోగుల ఆత్మబలిదానాలు ఎన్నో రాజకీయ పార్టీల పోరాటం ఉద్యోగుల కష్టం ఫలితంగా తెలంగాణ సిద్దించిందనే విషయం కల్వకుంట్ల కుటుంబం గుర్తుపెట్టుకోవాలి అన్నారు.. మాయమాటలు,మభ్య మాటలు చెబుతూ రెండు సార్లు అధికారంలో కి వచ్చారన్నారు ఎవరికైనా ఒక్కసారి, రెండుసార్లు నమ్ముతారని సీఎం కెసిఆర్ మూడో సారి తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని, బీఅర్ఎస్ కు కాలం చెల్లె రోజులు వచేయని విమర్శించారు…అదేవిధంగా తెలంగాణ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కటిస్తా….. పోడ్డు భూములకు పట్టాలు ఇప్పిస్తా…. మీ బిడ్డలకు ఉద్యోగం ఇప్పిస్తా అంటూ ఇ లా ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి రెండు సార్లు అధికారం లో కి వచ్చారన్నారు.. మళ్ళీ అవే మభ్యపు మాటలు చెప్పి మూడోసారి అధికారం లో కి వద్దామని చేసే ప్రయత్నంకు తెలంగాణ ప్రజలు స్వస్తి చెపుతారని పేర్కొన్నారు…మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వం సీఎం కెసిఆర్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు .. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కొరం కన్నకయ, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వ విజయబాబు, జారే ఆదినారాయణ,తదితరులు పాల్గొన్నారు